ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెబుతున్న ప్రభాస్

April 17, 2020 at 9:26 am

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇటీవల షూటింగ్‌ను జార్జియాలో జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌ జరుగుతుండగానే ప్రపంచంలో కరోనా వైరస్ తన ప్రతాపాని చూపింది. ఇక ఈ వైరస్ దెబ్బకు ఇండియాకు తిరిగి వచ్చిన చిత్ర యూనిట్, ప్రస్తుతం స్వీయ నిర్భంధంలో ఉన్నారు. ప్రభాస్ కూడా ఇంటికే పరిమితం కావడంతో ఈ సినిమా షూటింగ్ పనులు వాయిదా వేశారు.

అయితే ఈ సినిమా మొదలై చాలా రోజులు గడుస్తున్నా ఈ చిత్రానికి సంబంధించి ఒక్క అప్‌డేట్ కూడా చిత్ర యూనిట్ ప్రకటించలేదు. దీంతో ఈ చిత్ర యూనిట్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. మిగతా చిత్రాల మాదిరిగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇవ్వక పోవడంతో ప్రభాస్‌పై ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇక సోషల్ మీడియాలో ఏకంగా యువీ క్రియేషన్స్‌ను బ్యాన్ చేయాలంటూ రచ్చ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ప్రభాస్ చిత్ర యూనిట్‌తో చర్చించాడని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన గుడ్ న్యూస్‌ను ప్రేక్షకులు తెలుపనున్నారట. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యుయెల్ రోల్ చేస్తున్నాడు. కాగా అందాల భామ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెబుతున్న ప్రభాస్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts