ఆ బోల్డ్ క్యారెక్ట‌ర్‌లో ర‌మ్య‌కృష్ణ‌…సినిమాకి అదే హైలెట్టా ?

April 7, 2020 at 9:29 am

బాలీవుడ్ సూప‌ర్‌హిట్ మూవీ అంధాధూన్ తెలుగులో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. మేర్ల‌పాక‌గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ హ‌రోగా న‌టిస్తున్నాడు. ఈ చిత్ంర హిందిలో ఇంత‌టి విజ‌యం సాధించ‌డానికి ముఖ్య కార‌ణ‌మేమిటంటే క‌థ, క‌థ‌నం, బాగా కుద‌ర‌డ‌మే. న‌టుడు ఆయుష్మాన్ ఖురాన్ న‌ట‌న అదిరిపోయింద‌ని చెప్పాలి. ఇక నెగిటివ్ రోల్‌లో ట‌బు పెర్ఫార్మెన్స్ అదుర్స్ అని చెప్పాలి. ట‌బు న‌టించిన ఈ బోల్డ్ క్యారెక్ట‌ర్ సినిమాకే హైలెట్ నిలిచింద‌ని చెప్పాలి. ప్ర‌స్తుతం తెలుగు రీమేక్ లో ఈ పాత్రను ఎవరు చేస్తారా అని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆలోచిస్తుండ‌గానే ఈ నేపథ్యంలో మొదట టబుయే నటిస్తుందనే వార్తలు వచ్చాయి.

అయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ట‌బుకి ఇక్క‌డ అంత క్రేజ్ ఉంటుందో లేదో అని భావించి తెలుగులో క్రేజ్ ఉన్న ఆర్టిస్ట్ కోసం అన్వేషిస్తున్నారు. ఆ తరువాత టాలీవుడ్ క్రేజీ యాంకర్ కమ్ ఆర్టిస్ట్ అనసూయ పేరు కూడా తెరపైకొచ్చింది. అంతేకాక టబు ఎలాగూ భారీ పారితోషకం డిమాండ్ చేస్తుంది కాబట్టి అనసూయను తీసుకోవాలనుకున్నారు. మ‌ళ్ళీ ఇలాంటి పాత్ర‌ల‌కు పెట్టింది పేరు ర‌మ్య‌కృష్ణ కాబ‌ట్టి ఫైన‌ల్‌గా ఆ పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకోవాలనే ఆలోచ‌న‌లో ఉన్నారట నిర్మాతలు. మరి రమ్యకృష్ణ నటించడానికి ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. అయితే ఈ పాత్ర‌కోసం ద‌ర్శ‌క‌నిర్మాత‌లే కాదు ప్రేక్ష‌కులు కూడా ర‌మ్య‌కృష్ణ ఉంటేనే బావుంటుంద‌ని భావిస్తున్నారు.

ఆ బోల్డ్ క్యారెక్ట‌ర్‌లో ర‌మ్య‌కృష్ణ‌…సినిమాకి అదే హైలెట్టా ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts