నెటిజన్ చేసిన ప‌నికి క‌న్నీరు పెట్టుకున్న రష్మిక..!

April 6, 2020 at 1:44 pm

రష్మిక మందన్న.. టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్స్‌లో ఒక‌రు. ఛలో అంటూ తెలుగు తెరకు ప‌రిచ‌య‌మైన ఈ ముద్దుగుమ్మ‌.. ఆ తర్వాత గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి సినిమాలతో భారీ హిట్స్ ఖాతాలో వేసుకుంది. వరుసపెట్టి స్టార్ హీరోలతో ఛాన్సులు పట్టేస్తున్న రష్మిక మందన్న.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హవా నడిపిస్తోంది. మ‌రియు తనదైన క్యూట్‌నెస్‌తో పెద్ద సంఖ్యలో అభిమానులను కూడా సంపాదించుకుంటుంది.

ఇక ఈ అందాల భామ ఓ నెటిజ‌న్ చేసిన ప‌నికి క‌న్నీరు పెట్టుకుంద‌ట‌. అదేంటో తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం. రష్మిక ఆదివారం తన 24వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులు సోషల్ మీడియాలో హడావుడి చేశారు. ఆమెకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఈ క్ర‌మంలోనే ఒకరు ర‌ష్మిక‌పై ఓ వీడియో రూపొందించి, ఆమె జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడింది.

దీనిపై రష్మిక సందిస్తూ… భావోద్వేగానికి గురి చేశావని, తన కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని ట్వీట్ చేసింది. ఈ వీడియోను బాగా ఎడిట్‌ చేశావని పేర్కొంటూ, ఆ నెటిజన్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఆ వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా, ప్ర‌స్తుతం ర‌ష్మిక బ‌న్నీ సినిమాలో న‌టించ‌నుంది. మ‌రియు మ‌రికొన్ని ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది.

నెటిజన్ చేసిన ప‌నికి క‌న్నీరు పెట్టుకున్న రష్మిక..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts