ప‌వ‌న్ మాస్ మ‌హారాజా మ‌ల్టీస్టార‌ర్‌…అదీ ఫ్లాప్ డైరెక్ట‌ర్‌తో

April 6, 2020 at 6:49 pm

పింక్ రీమేక్ చిత్రంతో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న జోరు పెంచారు ఆయ‌న‌ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. ఫుల్ బిజీగా సినిమాలు చేసేద్దాం అనుకునేస‌రికి క‌రోనా వ‌ల్ల కాస్త గ్యాప్ వ‌చ్చింది.`పింక్‌` రీమేక్ ఆధారంగా రూపొందుతున్న `వ‌కీల్‌సాబ్‌`తో మ‌ళ్లీ న‌టించ‌డం మొద‌లుపెట్టాడు. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో బోనీక‌పూర్‌, దిల్ రాజు క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో కొన్ని కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ మాత్రం బ్యాలెన్స్‌గా వుంది. ఆల్రెడీ మూడు షెడ్యూల్స్ వ‌ర‌కు షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ సినిమాతో పాటు క్రిష్ చిత్రాన్ని కూడా అంగీక‌రించిన ప‌వ‌న్ ఈ మూవీ షూటింగ్ ద‌శ‌లో వుండ‌గానే హ‌రీష్‌శంక‌ర్ డైరెక్ష‌న్‌లో మైత్రీమూవీ మేక‌ర్స్ చిత్రాన్ని కూడా ఇటీవ‌లే ప్ర‌క‌టించేశాడు. ఇవే కాకుండా త్రివిక్ర‌మ్‌తో ఓ సినిమా కిషోర్ కుమార్ పార్థ‌సాని మరో సినిమాని ప‌వ‌న్ ప్లాన్ చేసిన‌ట్టు గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కిషోర్‌తో చేయ‌బోయే చిత్రం మాత్రం మ‌ల్టీస్టార‌ర్ చిత్ర‌మ‌ని తెలిసింది. ఓ త‌మిళ సినిమా లైన్‌ని తీసుకుని ఈ చిత్రాన్ని చేయ‌బోతున్నార‌ట‌.

కిషోర్ కుమార్ పార్థ‌సాని `గోపాల గోపాల‌` చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ విష‌యం తెలిసిందే. ప‌వ‌న్‌తో చేయ‌బోయే చిత్రం దీనికి సీక్వెల్ అనే స్థాయిలో వుంటుంద‌ని ఇప్ప‌టికే ఓ వార్త బ‌య‌టికి వ‌చ్చింది. మ‌రి ఒక ర‌కంగా చెప్పాలంటే గోపాల గోపాల చిత్రం అది పెద్ద హిట్ అయితే కాలేదు. ఇందులో మ‌రో హీరోగా మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించ‌నున్నాడ‌ని, ఈ చిత్రాన్ని ఇటీవ‌ల ర‌వితేజ‌తో `నేల టిక్కెట్టు`, డిస్కోరాజా వంటి చిత్రాల్ని నిర్మించి భారీ స్థాయిలో న‌ష్టపోయిన రామ్ తాళ్లూరి నిర్మించ‌నున్న‌ట్టు తెలిసింది. మ‌రి ఈ చిత్ర‌మైన క‌నీసం హిట్ అవుతుందో లేక గోపాల గోపాల లా అడ్ర‌స్ లేకుండా పోతుందో వేచి చూడాలి.

ప‌వ‌న్ మాస్ మ‌హారాజా మ‌ల్టీస్టార‌ర్‌…అదీ ఫ్లాప్ డైరెక్ట‌ర్‌తో
0 votes, 0.00 avg. rating (0% score)