అజ‌య్‌దేవ‌గ‌న్‌కి ఆర్‌.ఆర్‌.ఆర్ టీమ్ క్ష‌మాప‌ణ‌లు…ఎందుకంటే?

April 4, 2020 at 8:56 am

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిస్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్. ఇద్ద‌రు టాప్ హీరోలు మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టిస్తున్న విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ చ‌ర‌ణ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్‌ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఒక వీడియోను వదలగా ఆ వీడియోకి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

నిన్న అజయ్ దేవగన్ పుట్టినరోజు అయినప్పటికీ, ఈ సినిమా నుంచి ఎలాంటి వీడియోను విడుద‌ల‌ చేయలేదు. ఈ విషయంపైనే రాజమౌళి టీమ్ అజయ్ దేవగన్‌ కి సారీ చెప్పింది. అజయ్ దేవగన్‌ బర్త్ డే సందర్భంగా ప్లాన్ చేసిన వీడియోను కొన్ని సాంకేతిక కారణాల వలన విడుదల చేయలేకపోయినట్టు త‌మ ట్విట‌ర్ ఎకౌంట్ నుంచి ట్వీట్ చేస్తూ క్షమించమని కోరింది. ఆయనతో కలిసి పనిచేసినందుకు గర్వంగా ఉందంటూ, ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. అయితే ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో బ‌హుశా కుద‌ర‌కపోయి ఉండ‌చ్చు.

ఇక ఇదిలా ఉంటే… ప్ర‌స్తుతం అంద‌రూ కూడా లాక్‌డ‌వున్ లో ఉంటూ ప్ర‌తి ఒక్క‌రికి ఎలా ఉండాలో చెబుతూ ప్ర‌జ‌ల్లో ఈ వ్యాధి పైన ఎవేర్‌నెస్ తీసుకువ‌స్తున్నారు. కానీ రాజ‌మౌళి ఒక్క‌డే త‌న సినిమా ప్ర‌మోష‌న్స్‌లో ఉన్నాడు. ఈ స‌మ‌యాన్ని త‌న సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం బాగా వాడుతున్నాడు.

అజ‌య్‌దేవ‌గ‌న్‌కి ఆర్‌.ఆర్‌.ఆర్ టీమ్ క్ష‌మాప‌ణ‌లు…ఎందుకంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts