అక్క‌తో త‌మ్ముడు వివాహేత‌ర సంబంధం…చివ‌రికి బావ ఏం చేశాడంటే?

May 23, 2020 at 4:04 pm

మ‌నిషికి అనుమానం పెనుభూతం అంటారు పెద్ద‌లు. అనుమానం అనేది ఎంత ప్ర‌మాద‌మంటే మ‌నిషి జీవితంలో ఆనందంగా ఉండ‌లేడు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే అదొక జ‌బ్బు అనుకోవ‌చ్చు. అంత ప్ర‌మాదం. ఇక ప్ర‌స్త‌తం రోజులు ఎలా ఉన్నాయంటే ఇప్ప‌టికీ కొంత మంది శాడిస్టులు అక్క‌తో సొంత త‌‌మ్ముడు వివాహేత‌ర సంబంధం పెట్టుకుంద‌ని అనుమానం వ‌చ్చిన బావ ఎంత‌కి తెగించాడంటే… ఆ మాట వింటుంటేనే ఒళ్ళంతా జ‌ల‌ద‌రించిపోతుంది. ప్రకాశం జిల్లాలో ఇలాంటి దారుణ‌మే ఒక‌టి చోటు చేసుకుంది. సొంత అక్కతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో బావమరిదిని బావే కొట్టి చంపినట్లు తేల్చారు.

బావ‌మ‌రిది పోకూరి రామస్వామి(55) గతేడాది సొంత ఇంటి కోసం భూమి పూజ చేశాడు. ఆ కార్యక్రమానికి బంధువులు అంద‌రూ రావడంతో అక్క ఇంటికి వెళ్లి పడుకున్నారు. ఆ సమయంలో అక్క పక్కనే రామస్వామి పడుకున్నాడు. అది చూసిన సుబ్బారావు సొంత అక్కతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానించాడు. త‌న భార్య‌తో రాస‌లీల‌లు కొన‌సాగిస్తున్నాడ‌ని ప‌గ పెంచుకున్నాడు.

ఎలాగైనా చంపాల‌ని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 12న రాత్రి భోజనం అయిన త‌ర్వాత‌ గొర్రెల దొడ్డి వద్ద కాపలాగా పడుకుని ఉన్న రామస్వామిని దారుణంగా కొట్టి చంపేశాడు. రోకలిబండతో ముఖంపై బలంగా కొట్టడంతో రామస్వామి అక్కడికక్కడే చనిపోయాడు. ఊళ్లో మంచిపేరున్న రామస్వామిని ఎవరు హత్య చేశారనే విష‌యం అక్క‌డ పెద్ద మిస్టరీ లాగా మారిపోయింది. చివ‌రికి పోలీసులు రంగంలోకి దిగాక అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అప్పటి నుంచి పరారీలో ఉన్న బావ సుబ్బారావు వీఆర్వో వద్ద లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. అక్కతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతోనే బావమరిదిని హతమార్చినట్లు పోలీసుల‌కు తెలిపాడు.

అక్క‌తో త‌మ్ముడు వివాహేత‌ర సంబంధం…చివ‌రికి బావ ఏం చేశాడంటే?
0 votes, 0.00 avg. rating (0% score)