అన్ని ప‌శువులు గ‌డ్డి తిన‌వు మైడియ‌ర్ శ్రీ‌ను

May 22, 2020 at 10:22 pm

ఈ మ‌ధ్య కాలంలో మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు కేంద్ర‌బిందువు అవుతున్నారు. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న చేసే కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు వివాదంగా మారుతున్నాయి. రోజూ ఏదో ఒక అంశం గురించి ప్రస్తావిస్తూ హాట్ టాపిగ్గా మారుతున్నారు మెగాబ్రదర్ నాగబాబు. మొన్నటి మొన్న జాతిపిత అయిన‌ మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సేకు దేశభక్తుడిగా కీర్తించి, త‌న సోష‌ల్ మీడియాలో వివాదాస్ప‌ద కామెంట్లు పెట్టారు. దాంతో సోష‌ల్ మీడియా అంతా ఒక్క‌సారిగా వేడెక్కిపోయింది. అయితే ఆ వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో తాను చేసిన వ్యాఖ్యల్ని తప్పుగా అర్ధం చేసుకోవద్దని నాగబాబు వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యల్ని మరిచిపోక ముందే మంత్రి అవంతి శ్రీనివాస్ పై మ‌ళ్ళీ ఆయ‌న‌ సెటైర్లు వేశాడు ఈ మెగా బ్రదర్ .

అస‌లేంజ‌రిగిందంటే…వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విష వాయువులు వెలువడిన విష‌యం అంద‌రికి తెలిసిందే. అనంతరం అక్కడి పరిస్థితులను చక్కబెట్టేలా ప్రజాప్రతినిధులు అక్కడ పల్లెనిద్ర చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆయ‌న‌ ఆదేశాల మేర‌కు అక్కడ నిద్ర చేసిన అవంతి శ్రీనివాస్..మరోసటి రోజు ఆ గ్రామంలో మూగజీవాలకు గడ్డి వేస్తూ కనిపించారు.

ప్ర‌స్తుతం ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అయితే ఆ ఫోటోలపై స్పందించిన నాగబాబు ..శ్రీనివాస్ పశువులకు గడ్డి వేస్తున్న ఫొటోను పోస్ట్ చేసి ‘అన్ని పశువులు గడ్డి తినవు మై డియర్ శ్రీను..’ అని కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ల పై వైసీపీ నేతలు విమర్శ గుప్పించారు. దాంతో ప్రజారాజ్యం పార్టీ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఈ రోజు వైసీపీ లో చేరి మంత్రి అయ్యారంటూ నాగబాబు అభిమానులు కూడా గుర్తు చేస్తున్నారు. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య కాస్త విమ‌ర్శ‌ల కామెంట్లు వెలువ‌డ్డాయి.

అన్ని ప‌శువులు గ‌డ్డి తిన‌వు మైడియ‌ర్ శ్రీ‌ను
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts