అన్న కోసం ఎన్టీఆర్… !

May 28, 2020 at 6:51 am

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్‌ సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు ఇప్పుడు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక అతను ఏ సినిమాకు అయినా ప్రచారం చేస్తున్నాడు అంటే చాలు ఆ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అనే భావన లో టాలీవుడ్ జనాలు ఉన్నారు. అందుకే అతని తో సినిమాలకు ప్రచారం చేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవ‌ల సంక్రాంతికి వ‌చ్చిన బ‌న్నీ అల వైకుంఠ‌పుర‌ములో సినిమా బాగుంద‌ని ఎన్టీఆర్ ఓ ట్వీట్ చేసిన వెంట‌నే ఎలాంటి రెస్సాన్స్ వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఇక ఇప్పుడు అతను తన అన్న క‌ళ్యాణ్‌రామ్‌ కోసం ప్రచారమే కాదు తన అన్న సినిమాలో నటించే ప్రయత్నాలు చేస్తున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. అన్న సినిమాలో ఒక పాత్రను చేయడానికి ముందుకు వచ్చాడని గత కొన్ని రోజులుగా హిట్ లేని అన్న క‌ళ్యాణ్‌రామ్‌ కోసం అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు అని సమాచారం. ఈ సినిమాలో అతను ఒక కీలక పాత్రలో దాదాపు అరగంట పాటు కనపడే అవకాశం ఉందని సమాచారం. క‌ళ్యాణ్ రామ్ గ‌త కొద్ది రోజులుగా తీవ్ర ఇబ్బందుల్లో ఉండ‌గా ఎన్టీఆర్ అత‌డి కోసం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు.

ఈ క్ర‌మంలోనే జై ల‌వ‌కుశ సినిమా చేసి క‌ళ్యాణ్ రామ్ అప్పులు అన్నీ తీర్చేసేలా చేశాడు. ఇక ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్‌కు ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇవ్వాల‌న్న క‌సితో ఉన్నాడ‌ట‌. అందుకే అన్న సినిమాలో మంచి పాత్ర చేస్తున్నాడ‌ని అంటున్నారు. దీనిపై త్వరలోనే ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఏ సినిమాలో చేస్తాడు అనేది తెలియదు. కాగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాను కళ్యాణ్ రామ్ హారిక అండ్ హాసిని బ్యానర్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి విదితమే.

అన్న కోసం ఎన్టీఆర్… !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts