ఆ టీడీపీ ఎమ్మెల్యేపై వైసీపీ ఆప‌రేష‌న్‌… జంప్ ఖాయ‌మేనా…!

May 28, 2020 at 6:59 am

రాజ‌కీయాల్లో ఎప్పుడూ ఒకే త‌ర‌హా ప‌రిస్థితి ఉండ‌దు. ఎప్పుడు ఎలా మారతాయో చెప్ప‌డం క‌ష్టం. ఇప్పుడు ప్రకాశం జిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు కూడా అలానే మారుతున్నాయి. ప‌రుచూరు నియోజ కవ‌ర్గం ప్ర‌కాశంలో అత్యంత కీల‌క‌మైంది. ఇక్క‌డ పార్టీ జెండా పాతాల‌ని వైసీపీ అనుకుంటోంది. ఈ క్ర‌మంలో నే ద‌గ్గుబాటి కుటుంబానికి అవ‌కాశం క‌ల్పించింది. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. అయితే, టీడీపీ నేత‌.. సిట్టింగ్ ఎమ్మెల్యే వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న ఏలూరి సాంబ‌శివ‌రావు దూకుడు ముందు ద‌గ్గుబాటి ఫెయిల‌య్యారు.

జ‌గ‌న్ సునామీలోనూ ఏలూరి వంటి యువ నాయ‌కుడు గెలుపు గెర్రం ఎక్క‌డం ప‌రుచూరులో టీడీపీ హ‌వా ను చెప్ప‌క‌నే చెబుతోంది. ఇక‌, గత ఏడాది ఎన్నిక‌ల అనంత‌రం ద‌గ్గుబాటి వైసీపీతో అంటీ ముట్ట‌న‌ట్టు వ్య వ‌హ‌రిస్తున్నారు. దీంతో ఆయ‌న‌ను త‌ప్పించి రావి రామ‌నాథంబాబును ఇంచార్జ్‌గా పెట్టారు. అయినా కూడా ఏలూరి దూకుడు ముందు, ఆయ‌న‌కున్న ప్ర‌జాభిమానం ముందు రావి ఏమాత్రం త‌ట్టుకోలేక పోతు న్నారు. ఈ నేప‌థ్యంలో ఏలూరినే వైసీపీలో ఆహ్వానిస్తే.. బెట‌ర‌ని విజ‌య‌సాయిరెడ్డి వంటి కీల‌క నాయ‌కులు త‌ల‌పోశారు.

ఈ క్ర‌మంలోనే ఏలూరితో కొన్నాళ్లుగా మంత‌నాలు చేస్తున్నారు. ఇక‌, ఏలూరి విష‌యానికి వ‌స్తే.. ఎరువులు, పురుగుమందుల ఫ్యాక్ట‌రీలతో పారిశ్రామిక వేత్త‌గా ఎదిగారు. తెలంగాణ‌కుచెందిన ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రా వుతోనూ వ్యాపార భాగ‌స్వామిగా ఉన్నారు. చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. దీంతో ఎన్ని ఒత్తిడులు వ‌చ్చినా.. ఏలూరి పార్టీ మారేది లేద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, వైసీపీ నుంచి ఇటీవ‌ల కాలంలో ఒత్తిళ్లు పెర‌గ‌డం, త‌న వ్యాపారాల‌కు ప్ర‌భుత్వ ప‌రంగా ప్ర‌తిబంధ‌కాలు ఏర్ప‌డ‌డం కార‌ణంగా ఏలూరి పార్టీ మారేందుకు రెడీ అవుతున్నార‌ని స‌మాచారం.

అదేస‌మ‌యంలో ఆయ‌న‌కు బీజేపీ నుంచి రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నా చౌద‌రి కూడా ట‌చ్‌లో ఉన్నారు. ఆయ‌న కూడా బీజేపీలోకి రావాల‌ని ఏలూరిపై ఒత్తిడి చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. పార్టీ మారే ప‌క్షంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీతోనే ముందుకు వెళ్తే.. మంచిద‌ని ఏలూరి భ‌విస్తున్న‌ట్టు స‌మాచారం మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

ఆ టీడీపీ ఎమ్మెల్యేపై వైసీపీ ఆప‌రేష‌న్‌… జంప్ ఖాయ‌మేనా…!
0 votes, 0.00 avg. rating (0% score)