ఇస్మార్ట్ పోరితో ఇక క‌ష్ట‌మే అంటున్న నిర్మాత‌లు?

May 22, 2020 at 8:22 pm

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాధ్ తెర‌కెక్కించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్‌. ఈ చిత్రంలో ఇద్దరు బ్యూటీలున్నా సక్సెస్‌ను పూర్తిగా క్యాప్చర్ చేసిన ఇస్మార్ట్ మాత్రం నభానటేష్ అని చెప్పాలి. మాస్ క్యారెక్ట‌ర్‌లో మాస్ డైలాగ్స్ చెపుతూ కుర్రాళ్ళ మ‌న‌సుల్ని దోచేసుకుంది. ఇస్మార్ట్ రామ్ పక్కన టర్కీ కోడిగా చెలరేగిపోయింది. ఇందులో ఇద్ద‌రు భామ‌లు న‌భాన‌టేష్‌, నిధి అగ‌ర్వాల్ ఇద్ద‌రూ పోటీ ప‌డిమ‌రీ త‌మ అంద‌చందాల‌ను ఆర‌బోసిన‌ప్ప‌టికీ. న‌ట‌న‌ప‌రంగా మంచి పేరు వ‌చ్చింది మాత్రం న‌భాన‌టేష్‌కే. నభాను వెతుక్కుంటూ అవకాశాలు బాగానే వచ్చాయి.

అలా ఎంపిక చేసుకున్న వాటిలో ఈమధ్యే వచ్చిన ‘డిస్కోరాజా’ ఫ్లాపైనా ఆ ఇంపాక్ట్ న‌భా త‌న పై పడకుండా బాగానేజాగ్రత్త పడింది. ఇప్పుడు సాయితేజ్‌తో సోలో బతుకే సో బెటర్ చేస్తోన్న నభా పారితోషికంగా ఒక్క‌సారిగా పెంచేసిందన్న కథనాల పై గుర్రుమంటోందట.’ఎంతివ్వాలో నిర్మాతలకు తెలుసు. ఎంతిస్తున్నారో తీసుకుంటున్న నాకు తెలుసు. అటూ ఇటూ క్లారిటీ ఉంది కనుక కథనాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అంటోందట నభా.

అయినా నేను ‘ఇంకా చాలా ఎద‌గాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే ఎదిగే ప్రయత్నాల్లోనే ఉన్నాను తప్ప, డిమాండ్ చేసేంత స్థాయికి ఎదిగ‌లేక‌పోలేదు. ఒకరిని ఇబ్బంది పెట్టే ర‌కాన్ని కాదు నేను. ఇచ్చేది తక్కువైతే నిర్మొహమాటంగా అడుగుతా. నచ్చినంత సంతోషంగా ఇస్తే కాదనకుండా సినిమాలు చేస్తా’ అంటోంది గడుసుగా. నాలుగు సినిమాలు చేసేసరికే నభా ఆరితేరిపోయిందన్న మాట!? ఇస్మార్ట్ పోరితో ఇక క‌ష్ట‌మే!? బాబోయ్ అంటున్నారు నిర్మాతలు. ఈ భామ మాములిది కాదు చాలా గ‌డుసైన‌దే అంటున్నారు.

ఇస్మార్ట్ పోరితో ఇక క‌ష్ట‌మే అంటున్న నిర్మాత‌లు?
0 votes, 0.00 avg. rating (0% score)