ఏడాది క్రిత‌మే పారిపోయారు… శ‌వ‌మై తేలారు?

May 31, 2020 at 10:50 am

ఈ మ‌ధ్య కాలంలో వివాహేత‌ర సంబంధాలు ఎక్కువ‌యిపోతున్నాయి. భార్యా భ‌ర్త‌ల బంధానికి అర్ధం లేకుండా పోతుంది. కుటుంబం విలువ‌లు, గౌర‌వాలు ఇలాంటి వ‌న్నీ మంట‌గ‌లిపి వివాహ‌మైన‌ప్ప‌టికీ ప‌రాయి వ్య‌క్తుల‌తో ప్రేమ వ్య‌వ‌హారాలు న‌డుపుతున్నారు కొంద‌రు. ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి తెలంగాణ‌లో సూర్యాపేట జిల్లాలో జ‌రిగింది. ఇద్ద‌రూ వివాహితులే అయిన‌ప్ప‌టికీ ఒక‌రితో ఒక‌రు ప్రేమ‌లో ప‌డ్డారు. ఇద్ద‌రూ క‌లిసి జీవించాల‌నుకునున్నారు. కుటుంబాల‌ను ప‌క్క‌న పెట్టి ఇద్ద‌రూ క‌లిసి వెళ్ళిపోయారు.

వీరి ఆచూకీ కోసం కుటుంబసభ్యులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. అయితే శనివారం గ్రామానికి చేరుకున్న ఈ జంట ఓ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. యువకుడు అక్కడికక్కడే చనిపోగా.. మహిళను గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి మ‌ృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ జంట ఏడాది తర్వాత స్వగ్రామానికి ఎందుకొచ్చారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారిద్దరూ వివాహితులే.

అయినప్పటికీ జీవిత భాగస్వాములను కాదనుకుని పరాయి వ్యక్తులతో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిసి జీవించాలనుకుని కుటుంబాలను కాదనుకుని వెళ్లిపోయారు. ఏమైందో తెలీదు గానీ చివరకు ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగింది. జిల్లాలోని చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు, మహిళకు వేర్వేరు వ్యక్తులతో గతంలోనూ వివాహాలు అయ్యాయి. వారికి ఇద్దరేసి పిల్లలున్నారు. కొంతకాలంగా ఇద్దరికీ పరిచయం ఏర్పడి అతడి ప్రేమగా మారింది. వీలు చిక్కినప్పుడల్లా శారీరకంగానూ కలిసేశారు.

ఏడాది క్రిత‌మే పారిపోయారు… శ‌వ‌మై తేలారు?
0 votes, 0.00 avg. rating (0% score)