కారులో శానిటైజర్ ఉంచవద్దు…!

May 28, 2020 at 7:30 pm

కరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పుడు శానిటైజర్ అనేది చాలా కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్కరు కూడా శానిటేషన్ లేకుండా బయటకు రావడం లేదు అనే చెప్పవచ్చు. దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు శానిటైజర్ లకు మంచి డిమాండ్ అనేది ఏర్పడుతుంది. అయితే ఈ విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలని దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడితే ఇబ్బందులు కచ్చితంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

దానికి మండే స్వభావం ఎక్కువగా ఉంటుందని చాలా మంది చెప్పారు. కొన్ని చోట్ల మనుషులకు మంటలు కూడా అంటుకున్నాయి కూడా. ఇక ఇప్పుడు కార్లను శుభ్రం చేసుకునే సమయంలో కూడా వేసవిలో కొంచెం శానిటైజర్ తో జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. ఆల్కహాల్‌ ఆధారిత పదార్థాలతో శానిటైజర్లు తయారు చేస్తారు. దీనితో అది చాలా వరకు వేగంగానే మండిపోతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.

అందుకే దాన్ని వాడే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు చేస్తున్నారు. వేడిగా ఉన్న సమయంలో కారులో దాన్ని ఉంచవద్దు అని హెచ్చరిస్తున్నారు. కారు లోపల వేడిమి ఎక్కువ ఉండటంతో ఆ శానిటైజర్‌ బాటిల్‌లో మంటలు చెలరేగడం తో అమెరికాలో ఒక కారు కారు కాలిపోయింది. ఇక చిన్న పిల్లలకు అది ఇవ్వొద్దు అని వారి చేతులను దానితో శుభ్రం చేసినా సరే మీరే చెయ్యాలి గాని వారి చేతిలో వేయవద్దు అని చెప్తున్నారు. అలాగే సబ్బునే ఎక్కువగా వాడుకుంటే మంచిది అంటున్నారు.

కారులో శానిటైజర్ ఉంచవద్దు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts