కిరోసిన్ పోసుకుని భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌…అస‌లు కార‌ణం ఏమిటంటే?

May 23, 2020 at 7:45 pm

భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు అనేవి చాలా స‌హ‌జం. చిన్న చిన్న విష‌యాల‌కు ఏదో ఒక గొడ‌వ‌లు అవ్వ‌డం ఇవ‌న్నీ కామ‌న్ అయితే ఒక‌రినొక‌రు అర్ధం చేసుకుని స‌ర్దుకుపోవ‌డ‌మే సంసారం. ఇక ఇదిలా ఉంటే… అది మాములు మ‌నుషుల‌యితే ఇవ‌న్నీ ప‌ర్వాలేదు. కానీ తాగుబోతుల‌యితే మాత్రం చాలా క‌ష్టం. ఎందుకంటే వారు తాగిన మైకంలో ఏమి చేస్తారో ఏమిటో కూడా వారికే అర్ధం కాని ప‌రిస్థితులు కొన్ని ఉంటాయి. మ‌రి అలాంటి సంద‌ర్భాల్లో ఏమి చెయ్యాలో కూడా ఒక్కోసారి క‌ట్టుకున్న భార్య‌, క‌న్న‌పిల్ల‌ల‌కు అర్ధం కాదు. అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో చోటు చేసుకుంది. తాగిన మైకంలో త‌న ఒంటిమీదే తానే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ఘ‌ట‌న స్థానికంగా అక్క‌డంతా క‌ల‌క‌లం రేపింది.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్యాస్మీయా గూడకు చెందిన 45 ఏళ్ల సుజిత్ నాయక్ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సుస్మిత, పిల్లలతో పాటు గత పదేళ్లుగా కిరాయి ఇంట్లో నివసిస్తున్నాడు. మద్యానికి అలవాటు పడిన సుజిత్ నాయక్ కొద్ది రోజులుగా రోజూ ఏదో ఒక విష‌యంలో భార్య‌తో గొడవ పడుతుండే వాడు. నిన్న(శుక్రవారం) కూడా ఫుల్ గా మందు తాగి ఇంటికి వచ్చాడు. దాంతో భ‌ర్త ఎలాగైనా ర్త గొడవ చేస్తాడని అనుకున్న భార్య సుస్మిత… భ‌య‌ప‌డి తన పిల్లలను తీసుకుని పక్కింటికి వెల్లింది. ఏమి చెయ్యాలో తోచ‌క‌ రాత్రి అక్కడే నిద్రించి…మరుసటి రోజు తెల్లవారు జామున ఇంటికి వెళ్లింది. ఇంటి లోపలికి వెళ్లే సరికి భర్త సజీవదహనమై కన్పించాడు. భార్య సుస్మిత వెంట‌నే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎవరిపైనా అనుమానం లేదని….తాగిన మైకంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కిరోసిన్ పోసుకుని భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌…అస‌లు కార‌ణం ఏమిటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)