వీడెంత ప్ర‌బుద్ధుడంటే…బ్ర‌తికుండ‌గానే క‌న్న‌త‌ల్లికి నిప్పంటించాడా?

May 28, 2020 at 8:49 am

క‌న్న‌త‌ల్లి క‌నిపించే దైవ‌మంటారు. న‌వ‌మాసాలు మోసి బిడ్డ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి త‌న ప్రాణాల‌ను సైతం ప‌ణంగా పెట్టి బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తుంది త‌ల్లి. క‌న్న‌బిడ్డ‌కు చిన్న క‌ష్ట‌మొచ్చిన త‌ట్టుకోలేదు త‌ల్లి. అలాంటిది ప్ర‌స్తుతం స‌మాజం ఎలా మారిపోయిందంటే… అలాంటి క‌న్న‌త‌ల్లికి కూడా నేడు విలువ‌లేకుండా పోయింది. డ‌బ్బుకు ఉన్న విలువ మ‌నుషుల‌కు బంధాల‌కు అనుబంధాల‌కు ఉండ‌డం లేదు. కేవ‌లం ఆస్తి కోసం క‌న్న‌త‌ల్లి చంప‌డానికి కూడా వెన‌కాడ‌లేదు ఓ ప్ర‌బుధ్దుడు. న‌ల్గొండ జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

నల్గొండ మండలంలోని నర్సింగ్ బట్లలో ఈఘటన జరిగింది. గ్రామానికి చెందిన తిరుమల శాంతమ్మకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులున్నారని, ఆస్తి పంపకాలు జరిగినప్పుడు తల్లి శాంతమ్మను చిన్న కొడుకు తిరుమల లింగస్వామి చూడాలని ఒప్పందం చేసుకున్నారు. అయితే తల్లిని ఊళ్లోని ఇంట్లోనే ఉంచి లింగస్వామి హైదరాబాద్​లో కూలీపని చేసుకుంటున్నాడు. లాక్ డౌన్ కార‌ణంగా పది రోజుల పాటు ప‌ని లేక‌పోవ‌డంతో గ్రామానికి వచ్చిన అతడు ఇంటిని అమ్మేందుకు ప్రయత్నాలు చేయగా, శాంతమ్మ అందుకు నిరాకరించింది. దీంతో మంగళవారం రాత్రి మంచం మీద పడుకున్న శాంతమ్మ(55)మీద కిరోసిన్ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలతో ఆమె అక్క‌డిక‌క్క‌డే ప్రాణాల‌ను కోల్పోయింది. మనవడు బాలకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేప‌ట్టారు. ప్ర‌స్తుతం లింగస్వామి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

వీడెంత ప్ర‌బుద్ధుడంటే…బ్ర‌తికుండ‌గానే క‌న్న‌త‌ల్లికి నిప్పంటించాడా?
0 votes, 0.00 avg. rating (0% score)