గుంటూరులో ఎస్సై..డీజీపీ చేసిన ప‌నికి ఎంత‌మంది ఫిదా అవుతున్నారంటే?

May 27, 2020 at 8:49 am

పోలీసులు ఎల్ల‌ప్పుడూ వారి విధుల‌ను నిర్వ‌ర్తించే ప‌నుల‌లో ఫుల్ బిజీగా ఉంటారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో పోలీసులు కేవ‌లం వారి విధుల‌ను మాత్ర‌మే నిర్వ‌ర్తించ‌డం కాకుండా స‌మాజం ప‌ట్ల తోటివారికి స‌హాయం చేసే ప‌నుల‌లో ముందుంటున్నారు. త‌మ మాన‌వ‌తా దృక్ప‌ధాన్ని చాటుకుంటున్నారు కొంద‌రు పోలీసులు. గుంటూరు జిల్లాలో దాచేప‌ల్లికి చెందిన మ‌హిళ పై భ‌ర్త క‌త్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాల‌తో ఆసుప‌త్రిలో చేర‌గా స్థానిక ఎస్సై బాల‌నాగిరెడ్డి ఆమెకు సాయం అందించారు. బాధితురాలి ప‌రిస్థితి విష‌మించ‌డంతో స‌ర్జ‌రీ చేయాల‌ని వైధ్యులు నిర్ధారించారు. దీంతో లాక్‌డౌన్ కావ‌డంతో ఆసుప‌త్రిలో ర‌క్తం అందుబాటులో లేకుండా పోయింది.

ఇదే సమయంలో అక్కడే ఉన్న ఎస్సై బాలనాగిరెడ్డికి సమస్య గురించి తెలిసి ఆయ‌న‌ వెంటనే ఏమీ ఆలోచించకుండా తాను రక్తం ఇస్తానని ముందుకు వచ్చారు. రక్తదానం చేసి మహిళ ప్రాణాలు నిలబెట్టారు ఆ ఎస్సై. దీంతో ఎస్సై బాలనాగిరెడ్డిని గుంటూరు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు అంతా కూడా ఆయ‌న పైన ప్రశంసల వ‌ర్షం కురిపించారు. అలాగే డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించడమే కాకుండా.. ఆమెకు రక్తం దానం చేసి ప్రాణాలు నిలబెట్టారంటూ ఏపీ పోలీసులు త‌మ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపారు.

గుంటూరులో ఎస్సై..డీజీపీ చేసిన ప‌నికి ఎంత‌మంది ఫిదా అవుతున్నారంటే?
0 votes, 0.00 avg. rating (0% score)