గుడ్ న్యూస్‌…రేప‌టి నుంచి తిరుమ‌ల ల‌డ్డు?

May 30, 2020 at 10:36 pm

తిరుప‌తి అంటే ముందుగా అంద‌రికి గుర్తువ‌చ్చేది వేంక‌టేశ్వ‌ర‌స్వామి. ఆ త‌రువాత ల‌డ్డు. ఈ ల‌డ్డుని దాదాపు అన్ని ర‌కాల వ‌య‌సుపిల్ల‌లు, అలాగే పెద్ద‌వాళ్ళ‌, పి్ల‌ల‌తిరుమల శ్రీ వారి లడ్డూ ప్రసాదాన్ని రేపటి (ఆదివారం) నుంచి హైదరాబాద్‌లో విక్రయించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇందులో బాగంగా తిరుమల నుంచి 40 వేల లడ్డూలను హైదరాబాద్‌కు పంపించినట్లు తెలిపింది. వారు ఈ ల‌డ్డుని ప్ర‌త్యేకంగా ఇష్ట‌ప‌డ‌తారు. లాక్‌డౌన్‌ కారణంగా శ్రీవారిని దర్శించుకోలేకపోతున్న నేపథ్యంలో భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందించాలన్న లక్ష్యంతో లడ్డూ ప్రసాదాలు విక్రయించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.

గత 6 రోజులుగా ఏపీలోని 13 జిల్లాల్లో లడ్డూలను విక్రయించగా.. దాదాపు 13 లక్షల మంది భక్తులు లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేశార‌ని టీటీడీ అధికారులు తెలిపారు. ఇత‌ర రాష్ట్రాల్లో ల‌డ్డూ ప్రసాదాల విక్ర‌యాల‌కు ఆయా ప్ర‌భుత్వాల అనుమ‌తి తీసుకుని ఈ మేర‌కు చ‌ర్య‌లు చేప‌డుతోంది టీటీడీ. ఈ క్ర‌మంలో మే 31 నుంచి హైద‌రాబాద్ లోని హిమాయ‌త్ న‌గ‌ర్ టీటీడీ ఆఫీసులో ల‌డ్డూల‌ను అందుబాటులో ఉంచ‌బోతోంది. సాధారణ రోజుల్లో లడ్డూ ధర 50 రూపాయలు ఉండగా ప్ర‌స్తుతం 50% సబ్సిడీతో ఒక్కో లడ్డూ రూ.25కే అందించేలా చర్యలు తీసుకుంటోంది. మ‌రి ఇంత త‌క‌కువ‌తక్కువ ధ‌ర‌కు ల‌డ్డూ అంటూ రేపు ఈ ల‌డ్డూ కోసం బారులు తీరుతారేమో.

గుడ్ న్యూస్‌…రేప‌టి నుంచి తిరుమ‌ల ల‌డ్డు?
0 votes, 0.00 avg. rating (0% score)