టూరిస్టుల‌కి గుడ్‌న్యూస్‌…గోవా రీ ఓపెన్‌..ఎప్ప‌టినుంచంటే?

May 23, 2020 at 8:44 pm

వేస‌వి సెల‌వులు వ‌చ్చాయంటే చాలు చాలా మంది టూరిస్టులు ఎక్కువ‌గా వెళ్ళ‌స్త్ర ప్ర‌దేశాల్లో గోవాని టూరిస్ట్ స్పాట్‌గా పెట్టుకుంటారు. క‌రోనా కార‌ణంగా ఎక్క‌డివారు అక్క‌డే లాక్ అయిపోవ‌డం వ‌ల్ల ఈ సంవ‌త్స‌రం ప‌ర్యాట‌కులు ఎక్క‌డికి వెళ్ళ‌డానికి లేదు. అయితే ప్ర‌స్తుతం ఇక్క‌డ ప‌ర్యాట‌కుల‌కు వెల్‌కం చెబుతున్నారు. ప్ర‌స్తుతం గోవా క‌రోనా ఫ్రీ స్టేట్‌గా మారింద‌ని, త్వ‌ర‌లోనే ఇక్క‌డ‌కి టూరిస్టుల‌కు ఆహ్వానం ఉంటుంద‌ని తెలిపారు గోవా గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్. ప్ర‌జ‌ల‌కు మ‌ళ్లీ గోవా టూరిస్ట్ డెస్టినేష‌న్ గా కొన‌సాగుతుంద‌ని, దేశంలో గోవా లాంటి క్లీన్ సిటీ మ‌రొక‌టి లేద‌న్నారు. అతి కొద్ది రోజుల్లోనే దేశంలోని ప్ర‌జ‌లు గోవా ప‌ర్య‌ట‌న‌కు రావ‌చ్చ‌ని, అయితే విదేశీ టూరిస్టుల‌ను అనుమ‌తించ‌డానికి కొన్నాళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు.

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా జ‌నాలు ఎక్క‌డా కూడా గుంపులుగా చేరకూడ‌దు కాబ‌ట్టి. చేరే అవ‌కాశాలు అన్ని ర‌కాల యాక్టివిటీల‌పై అక్క‌డ నిషేధం నిలిపివేశారు. దేశంలో అన్ని ప‌ర్యాట‌క ప్రాంతాలు క్లోజ్ అయ్యాయి. అలాగే బ‌స్సులు, రైళ్లు, విమానాలు ర‌వాణా శాఖ కూడా మొత్తం ఎక్కడివి అక్క‌డే నిలిచిపోయాయి. ఇటీవ‌లే బ‌స్సులు, రైళ్ల ప్ర‌యాణాల‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో పాటు సోమ‌వారం నుంచి విమాన స‌ర్వీసుల‌ను కూడా ప్రారంభించ‌బోతోంది. అయితే ఇప్ప‌టికే గోవా క‌రోనా ఫ్రీ స్టేట్ గా మార‌డంతో త్వ‌ర‌లోనే ప‌ర్యాట‌కుల‌ను అనుమ‌తించేందుకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు కూడా మొద‌లుపెట్టేసింది.

టూరిస్టుల‌కి గుడ్‌న్యూస్‌…గోవా రీ ఓపెన్‌..ఎప్ప‌టినుంచంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts