నాగ‌బాబు ట్వీట్ల‌తో సంబంధం లేదంటూ ప‌వ‌న్ సంచ‌ల‌న స్టేట్మెంట్‌

May 23, 2020 at 7:21 pm

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు జ‌రిగిన స‌మ‌యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యి నేటితో సంవత్సరం పూర్తయ్యింది. అయితే ప్ర‌స్తుతం ఈ అంశం ఇప్పుడు జనసేన పార్టీ శ్రేణుల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేసిన సంచలన స్టేట్మెంట్ ఇప్పుడు కాక రేపుతోంది.

అదేమిటంటే…తాజాగా పవన్ సోదరుడు మరియు జనసేన పార్టీలో కీలక నేత అయిన‌ నాగేంద్ర బాబు గ‌త కొద్ది రోజులుగా కొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు కేంద్ర‌బిందువ‌వుతున్న విష‌యం తెలిసిందే. తన ట్విట్టర్ ఖాతా ద్వారా చేసిన ఓ ట్వీట్ పెను ధుమారమే రేపింది. దీనితో దాని ఎఫెక్ట్ కాస్త జనసేన పార్టీపై పడడంతో నేడు పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయ‌న జనసేన పార్టీ తరపున విడుదల చేసారు.

తమ పార్టీ వ్యక్తులు అయినప్పటికీ వారి వ్యక్తిగత అభిప్రాయాల‌కు తన పార్టీకు మాత్రం ఎటువంటి సంబంధిం లేద‌ని అలాగే అవి పార్టీకి సంబంధించినవి కావని అదే విధంగా నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పూర్తిగా ఆయన వ్యక్తిగతం మాత్రమే తప్ప వాటికి తన పార్టీకు ఎలాంటి సంబంధము లేదని ఖరాఖండిగా చెప్పేసారు. ఇది కరోనా కష్టకాలం కావున ప్రతీ ఒక్కరూ ప్రజాసేవలో పాల్గొనాలి అంటూ ఆయ‌న‌ సూచించారు.

నాగ‌బాబు ట్వీట్ల‌తో సంబంధం లేదంటూ ప‌వ‌న్ సంచ‌ల‌న స్టేట్మెంట్‌
0 votes, 0.00 avg. rating (0% score)