న‌య‌న్‌తార‌కు స‌లాం కొడుతున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ

May 30, 2020 at 10:22 pm

‘‘నయనతార అద్భుత నటన, తన సంకల్పం చూసి ఆశ్చర్యపోయాను. తను ఓ ఫైటర్‌. పోరాట యోధురాలిగా కనిపిస్తుంది. ఆమెలో ఏదో ప్రత్యేకత ఉంది. అంతేగాక తను చేసే పనికి కట్టుబడి ఉంటుంది. తను చాలా చిన్న వయస్సు నుంచే నటిస్తున్నారు. అంతేకాదు అద్భుత నటి కూడా. అయినప్పటికీ నిరాడంబరంగా ఉంటారు. అది నన్ను చాలా ఆకర్షించింది’’ అంటూ నయనతారతో కలిసి పనిచేసిన అనుభవం గురించి చెప్పుకొచ్చారు ఓ ఇంటర్య్వూలో కత్రినా. నయనతార పై కత్రినా కైఫ్ ‌ ప్రశంసల జల్లు కురిపించారు.

కత్రినా మేకప్‌ బ్రాండ్‌ ‘కే’ KAY కు నయనతార‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కే ప్రచార ప్రకటన కోసం నయన్‌ ఇటీవల ముంబై వెళ్ళింది. తన మేకప్‌ బ్రాండ్‌ ప్రకటన కోసం నమనతార సమయాన్ని కేటాయించినందుకు కత్రినా సోషల్‌ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు… ‘సౌత్‌ లేడీ సూపర్‌‌ స్టార్‌ నయనతారకు పెద్ద ధన్యవాదాలు. మీ బిజీ షెడ్యూల్‌లో కూడా ముంబై వచ్చి.. మా మేకప్‌ బ్రాండ్‌ ప్రకటనకు మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. మీ ఉదారతకు.. అందానికి ఎప్పటికీ సలాం’ అంటూ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.ఇటీవల సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సరసన ‘దర్భార్’లో‌ నటించిన నయనతార ప్రస్తుతం విజయ్‌ సేతుపతితో కలిసి తమిళ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కత్రినా అక్షయ్‌ కుమార్‌తో ‘సూర్యవంశీ’ సినిమాలో నటిస్తున్నారు.

ప్రముఖ నాయికలు నయనతార, సమంత హీరోయిన్లుగా, విజయ్‌ సేతుపతి హీరోగా తమిళంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు ‘కాదువాక్కుల రెండు కాదల్‌’ అనే టైటిల్‌ పెట్టారు.. ముక్కోణపు ప్రేమకథగా .. వినోద ప్రధానంగా సాగే ..ఈ సినిమా షూటింగ్‌ మేలో ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా వల్ల ఆగింది. త్వరలోనే సినిమా షూటింగ్స్‌కి అనుమతి లభిస్తుందనే ఉద్దేశంతో ఆగస్ట్‌ నెల నుంచి ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారని సమాచారం.

న‌య‌న్‌తార‌కు స‌లాం కొడుతున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ
0 votes, 0.00 avg. rating (0% score)