పూజా డిమాండ్లు ఏంటి బాబోయ్ అంత‌లా పెంచేసింది…నిర్మాత‌లు కూడా త‌గ్గ‌ట్లేదుగా?

May 26, 2020 at 7:54 pm

ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే. ఒక్క టాలీవుడ్ మాత్ర‌మే కాదు బాలీవుడ్ స‌హా సౌత్ లో కూడా ఈ భామ‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాద‌ని చెప్పాలి. డీజే గాళ్ గా అటు మాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు కూడా ఈ భామ‌ సుప‌రిచితమే. ప్ర‌స్తుతం ఈ భామ వ‌రుస‌గా భారీ చిత్రాల్లో న‌టిస్తోంది. ఇదే స‌మ‌యంలో అటు మాలీవుడ్ లోనూ అడుగు పెడుతోంది. అయితే ఇక్క‌డ వ‌చ్చిన చిక్కంతా ఏమిటంటే…అక్కడ కూడా ఈ భామ‌ టాలీవుడ్ రేంజులో పారితోషికం డిమాండ్ చేస్తోంద‌ట‌.

దుల్కార్ స‌ల్మాన్ హీరోగా హను రాఘవపుడి దర్శకత్వంలో స్వప్న సినిమాస్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాని ప్ర‌క‌టించ‌నున్నారు. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేని ఎంపిక చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. దుల్కార్ – పూజా జోడీ కుదిరితే ఇక ఆ సినిమా బిజినెస్ రేంజ్ పెరుగుతుంద‌నేది ద‌త్ వార‌సుల్లోని ఆలోచ‌న‌. అయితే ఇక్క‌డే ఓ చిక్కు కూడా ఉంది.

డిమాండ్‌ని బ‌ట్టి రేటు ఎలా పెంచాలో ఈ ముంబై బొమ్మ‌కు తెలిసినంత‌గా వేరే ఎవ‌రికీ తెలీదేమో! ఇదే అద‌నుగా పూజా హెగ్డే భారీ పారితోషికం డిమాండ్ చేసింద‌ట‌. ఇప్ప‌టికే 2కోట్ల క్ల‌బ్ నాయిక‌గా పాపుల‌రైంది కాబ‌ట్టి ఆ రేంజులో పారితోషికం అడిగింద‌ట‌. అయితే అందుకు మ‌రి స్వ‌ప్న సినిమాస్ అంగీక‌రించింద‌ని తెలుస్తోంది. జూన్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. ఇన్నాళ్లు క‌రోనా లాక్ డౌన్ వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ కూడా పెండింగులో ప‌డిపోయింద‌ట‌. ప్ర‌స్తుతం పూజా ఇన్ స్టా మాధ్య‌మాల్లో త‌న లేటెస్ట్ ఫోటోలతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది.

పూజా డిమాండ్లు ఏంటి బాబోయ్ అంత‌లా పెంచేసింది…నిర్మాత‌లు కూడా త‌గ్గ‌ట్లేదుగా?
0 votes, 0.00 avg. rating (0% score)