ప్రేమిస్తున్నాన‌ని వెంట తీసుకెళ్ళాడు… చివ‌రికి స్నేహితుల‌తో క‌లిసి?

May 24, 2020 at 2:31 pm

ఎన్ని చ‌ట్టాలు..ఎన్నిశిక్ష‌లు వ‌చ్చినా కూడా దేశంలో ఆడ‌వాళ్ళ పైన మృగాళ్ళ ఆగ‌డాలు మాత్రం ఆగ‌డం లేదు. అందులోనూ ఏపీలో దిశ చ‌ట్టం అమ‌లులో ఉన్న‌ప్ప‌టికీ కొంద‌రు కామాంధులు ఏమాత్రం భ‌య‌ప‌డ‌టం లేదు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బాలిక పై జరిగిన సామూహిక అత్యాచారమే ఇందుకు ఉదాహరణ. చీమకుర్తికి చెందిన రామయ్య అనే వ్య‌క్తి ఓ బాలికను నమ్మించి మోసం చేయడమే కాకుండా స్నేహితులతో కలిసి ఆమె పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె పై లైంగిక వాంఛ తీర్చుకోవడమే కాకుండా వీడియోలు తీసి బెదిరించాడు.

తన స్నేహితులకు కూడా లైంగికంగా దగ్గరవ్వాలని సూచించాడు. ఆమె దానికి ఒప్పుకోక‌పోవ‌డంతో రామయ్య ఇంట్లనో బందీగా ఉన్న ఆ బాలికపై వారంతా కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి చాకచక్యంగా తప్పించుకుని ఆ బాలిక ఒంగోలు చేరుకుంది. అనుమానాస్పద స్థితిలో ఉన్న బాలికను పోలీసులు విచారించగా తన పై జరిగిన లైంగిక దాడిని వివరించింది. దీంతో ఆమెను ముందు క్వారంటైన్ కు తరలించారు. బాలికపై రామయ్య సుమారు 20సార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.

తెలంగాణ లోని ఖమ్మంకు చెందిన బాలిక‌గా గుర్తించారు. ఆ ప్రాంతానికి రామయ్య బేల్దారి పనులకు వెళ్లి ఈ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి చీమకుర్తికి తీసుకొచ్చాడు. అనంతరం ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమిస్తున్నాన‌ని వెంట తీసుకెళ్ళాడు… చివ‌రికి స్నేహితుల‌తో క‌లిసి?
0 votes, 0.00 avg. rating (0% score)