బాల‌య్య‌తో పాయ‌ల్ పాప రొమాన్సా?

May 22, 2020 at 8:45 pm

మొద‌టి సినిమా నుంచే బోల్డ్ పాత్ర‌లో న‌టించి మెప్పించింది పాయ‌ల్ రాజ్‌పుత్‌. మొద‌టి సినిమాలోనే నెగిటివ్ క్యారెక్ట‌ర్‌లో న‌టించాలంటే ఒక‌ర‌కంగా చెప్పాలంటే అలాంటి పాత్ర చేయ‌డానికి చాలా ఘ‌ట్స్ కావాల‌నే చెప్పాలి. మ‌రి అంత అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచి మంచి పేరు తెచ్చుకుంది పాయ‌ల్‌రాజ్‌పుత్‌. అయితే అందం, అభినయంలో ఎలాంటి లోటూ లేకున్నా.. ఎందుకో పాయల్ రాజ్‌పుత్‌కు మాత్రం చెప్పుకోతగ్గ అవకాశాలు మాత్రం దక్కడం లేదు. ఆమె గ్లామర్‌ని కమర్షియల్ పాయింట్‌లో టచ్ చేశారే తప్ప, ఆమెలోని పెర్ఫార్మెన్స్ కోణాన్ని పూర్తిగా చూపించే పాత్రలే ఆమెకు పడలేదు.

ఈమధ్య సీనియర్ హీరో వెంకటేష్‌తో వెంకీమామ చేయడంతో సినిమా ఓకే అనిపించుకున్నా.. కుర్ర హీరోల సరసన ఆమెకు పాత్రలు లేకుండా పోయాయి. పైగా తొలి సినిమా ఆర్‌ఎక్స్ 100లో చేసిన పాత్ర హిట్టనిపించుకున్నా కెరీర్‌కు ఆ పాత్ర కాస్త బ్యాడ్‌గానే మారింద‌ని చెప్పాలి. అయితే ర‌వితేజ‌తో క‌లిసి డిస్కోరాజాలో న‌టించింది. అందులో ఆమెకు డైలాగ్స్ ఉండ‌వు కాని న‌ట‌న‌వ‌ర‌కు ఓకే అని చెప్పాలి.

మధ్యలో ఆమె చేసిన బోల్డ్ చిత్రాలు, స్పెషల్ సాంగ్స్ కూడా స్టేటస్‌వున్న హీరోయిన్‌గా ఆమెకు గుర్తింపు లేకుండా చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాయల్‌కు మళ్లీ ఓ సీనియర్ హీరో సరసనే ఛాన్స్ వచ్చిందట. బోయపాటి తెరకెక్కిస్తోన్న ప్రాజెక్టులో బాలయ్యతో రొమాన్స్ చేసే హీరోయిన్‌గా పాయల్‌ను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది.

దర్శకుడు హీరో ఇద్ద‌రూ హిట్‌ కాంబినేషన్ కావ‌డంతో పాయల్ సైతం భవిష్యత్ కెరీర్‌ని పక్కనపెట్టేసి ప్రాజెక్టుకు ఓకే చెప్పిందని అంటున్నారు. ఈ ప్రాజెక్టు కోసం చాలా మంది హీరోయిన్లను సంప్రదించిన బోయపాటి చివరకు పాయల్ దగ్గర ఆగాడంటున్నారు. ఈ హ్యాట్రిక్ కాంబో కనుక హిట్టయితే పాయల్‌కు మాత్రం ఈసారి పేరు రావడం ఖాయం.

బాల‌య్య‌తో పాయ‌ల్ పాప రొమాన్సా?
0 votes, 0.00 avg. rating (0% score)