బావిలో జ‌రిగిన‌ మిస్టరీ… మక్సూద్ జేబులో కండోమ్… అస‌లు ఏం జరిగిందంటే?

May 23, 2020 at 10:26 am

ఇటీవ‌లె వ‌రంగ‌ల్ బావిలో నుంచి 9 మృత‌దేహాల‌ను వెలికి తీసిన విష‌యం తెలిసిందే. అయితే ఇవి హ‌త్య‌లా లేక ఆత్మ‌హ‌త్య‌లా అన్న‌ది ఎవ్వ‌రి అర్ధం కాకుండా పెద్ద మిస్ట‌రీలా త‌యార‌యింది ఈ కేసు. ప్ర‌స్తుతం పోలీసుల‌కు స‌వాలుగా తీసుకున్న ఈ కేసు హ‌త్యాలేక ఆత్మ‌హ‌త్యా అనే కోణంలో విచార‌ణ కొన‌సాగిస్తున్నారు. ఇక ఇందులో మృతి చెందిన వారి ఫోన్లు ఆ రోజు సాయంత్ర‌మే స్విచ్ఛాఫ్ అవ్వ‌డం అనేది అర్ధం కాలేదు. అయితే ఇందులో మ‌క్సాద్ ఫోన్ మాత్రం ఆ రోజు రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లోనే ఉండ‌టం అంద‌రి దృష్టి అత‌నిపైనే మ‌ళ్ళింది.

అంతేకాక మక్సూద్ కుమారుడి పుట్టిన రోజు బుధవారం కావ‌డంతో ఆరోజు రాత్రి నిర్వహించగా.. అందరూ కలిసి విందు చేసుకున్నారు. గురువారం తెల్లారేసరికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వారి ఆచూకీ కోసం గాలించగా.. బావిలో నాలుగు శవాలు తేలాయి. మ‌ళ్ళీ శుక్రవారం మరో ఐదు శవాలను వెలికి తీశారు. ఇక మృతదేహాలను గుర్తించిన అనంతరం మక్సూద్ ఉంటున్న ఇంటిని తనిఖీ చేయగా.. అతడి జేబులో కండోమ్ ప్యాకెట్ కనిపించింది. పెళ్లయ్యి ముగ్గురు పిల్లలున్న అతడి వ‌ద్ద‌ కండోమ్ ఉండటం అనుమానాలకు తావిస్తోంది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన మక్సూద్ కుటుంబం 20 ఏళ్ల క్రితమే వరంగల్ వచ్చి స్థిరపడ్డారు. మక్సూద్ భార్య, ఇద్దరు మ‌గ‌పిల్ల‌ల‌తో క‌లిసి అంతేకాక త‌న పెద్ద కుమార్తె భర్తకు దూరంగా ఉంటూ ఆమె కూడా తన మూడేళ్ల కొడుకుతోపాటు వీరితోనే క‌లిసి ఉంటోంది. ఇంతకు ముందు వారు కరీమాబాద్‌లో ఉండగా… లాక్‌డౌన్ కారణంగా రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో.. వారు పని చేసే గోడౌన్‌లోనే ఉంటున్నారు. అయితే అదే గోడౌన్‌లో బిహార్‌కు చెందిన మరో ఇద్దరు యువకులు కూడా ఉంటున్నారు.

ఇక ఆ రోజు బుధ‌వారం సాయంత్రం ఆరు గంటలకు మక్సూద్ మినహా అందరి సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఏడు గంటలకి షకీల్ అనే వ్యక్తిని తన ఇంటికి రావాలని మక్సూద్ పిలిచినట్టు తెలుస్తోంది. రాత్రి 7.45 గంటలకు గోదాం యజమానితో మక్సూద్ మాట్లాడాడు. రాత్రి 9 గంటల సమయంలో అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. దీంతో సాయంత్రం నుంచి రాత్రి 9 గంటల మధ్య ఏం జరిగిందనేది మిస్ట‌రీగా మారింది.

అయితే మక్సూద్, ఆయన భార్య, కుమార్తె బూస్రాతోపాటు మూడేళ్ల బాలుడి మృతదేహాలను గురువారం బావిలో నుంచి వెలికి తీశారు. శుక్రవారం మరో మృతదేహం పైకి తేలడంతో.. బావిలో నుంచి నీటిని తోడేసి మక్సూద్ కుమారులు షాబాజ్, సోహిల్ మృతదేహాలతోపాటు గోనె సంచుల గోడౌన్‌కు వాహనాలను నడిపే డ్రైవర్ షకీల్.. బిహార్‌కు చెందిన శ్రీరామ్, శ్యామ్‌ల మృతదేహాలను వెలికి తీశారు.

మసూద్ కూతురు బుస్రా వరంగల్‌లో ఓ వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతోందని ప్రచారం అయితే ఉంది. ఈ విషయమై బుస్రాకు ఆమె తల్లితో గొడవలు జరిగాయని.. దీంతో బుస్రాతో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తి వచ్చి ఘర్షణకు దిగారా అనే అనుమానం వ‌స్తుంది. ఇవి ఆత్మహత్యలే అయితే.. క‌నుక వీరితో పాటు డ్రైవర్‌, బిహార్‌కు చెందిన కుర్రాళ్ళు బలవన్మరణం చెందాల్సిన‌ అవసరం ఏంటో అర్ధం కాలేదు.

బావిలో జ‌రిగిన‌ మిస్టరీ… మక్సూద్ జేబులో కండోమ్… అస‌లు ఏం జరిగిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)