బోరు బావిలో చిన్నారి మృతి…ఎన్ని అడుగుల లోతంటే?

May 28, 2020 at 7:17 am

బోరు బావులు ఉన్న చోట చిన్నారుల‌ను చాలా జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని ఎన్నోసార్లు చాలా మంది చెబుతుంటారు. కానీ ఎక్క‌డో జ‌రిగే చిన్న నిర్ల‌క్ష్యం వ‌ల్ల అభం శుభం ఎరుగ‌ని చిన్నారులు మృత్యువాత‌ప‌డుతుంటారు. మెద‌క్ జిల్లాలో ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి చోటు చేసుకుంది. మ‌రో చిన్నారి ఈ బోరుబావికి బ‌ల‌య్యాడు. మెద‌క్‌జిల్లా పాప‌న్న పేట‌లో బుధ‌వారం ఐదు గంట‌ల స‌మ‌యంలో బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో ప‌డిపోయాడు. దీన్ని గ‌మ‌నించిన స్థానికులు 108 వాహ‌నానికి వెంట‌నే స‌మాచార‌మిచ్చారు. అయితే వారు ఆక్సిజ‌న్ పైపులోనికి పంపి బాలుడిని క్షేమంగా బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేకుండా పోయింది.

బోరు బావి 150 అడుగుల లోతు ఉండగా.. చిన్నారి సంజయ్‌ 25 అడుగుల లోతున ఉండొచ్చని భావించా. బోరు బావికి సమాంతరంగా గొయ్యి తవ్వారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు దగ్గరుండి ఈ సహాయక చర్యల‌ను పర్యవేక్షించారు. బాలుడు సురక్షితంగా బయటపడతాడని భావించారు.. కానీ ఆ త‌ల్లికి చివ‌రికి క‌డుపుకోతే మిగిలింది. సాయి వర్ధన్ మెదక్ జిల్లాలో తన తాత భిక్షపతి ఇంటికి నాలుగు నెలల క్రితం వచ్చాడు. ఆయన పొలంలోనే మూడు బోర్లు వేశారు.. కానీ నీళ్లు మాత్రం పడలేదు. రెండు బావుల్ని మూతవేశారు కానీ.. మరో బావిని మర్చిపోయారు. ఇంతలోనే అనుకోకుండా ఈ ప్ర‌మాదం ముంచుకొచ్చింది. బాలుడు ఆ బావిలో ప‌డి ప్రాణాల‌ను కోల్పోయాడు.

బోరు బావిలో చిన్నారి మృతి…ఎన్ని అడుగుల లోతంటే?
0 votes, 0.00 avg. rating (0% score)