బ్రేకింగ్.. బావిలో మృతదేహాలు.. వీడుతున్న మిస్టరీ

May 24, 2020 at 7:06 pm

వరంగల్‌ శివారులోని ఓ బావిలో తొమ్మిది మంది విగతజీవులై కనిపించిన కేసులో ఇప్పుడిప్పుడే మిస్టరీ వీడుతోంది. ఫోరెన్సిక్‌ ప్రాథమిక నివేదికలో ఈ మృతులకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపడుతున్నాయి. బావిలో నుంచి నిన్న బయటకు తీసిన 9 మృతదేహాలకు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ఇవాళ శవపరీక్ష పూర్తి అయింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా వారిని బావిలోకి నెట్టి చంపారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నీట మునగడం వల్లే మరణాలు సంభవించినట్లు ప్రాథమిన నివేదికలో వెల్లడైంది.

అయితే రెండు మృతదేహాల్లో మాత్రం ఊపిరితిత్తుల్లో నీళ్లు కనిపించలేదని నివేదికలో తేలింది. మత్తులో ఉన్నప్పుడు ఈడ్చుకొచ్చి బావిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను ఈడ్చుకొచ్చినట్లు వారి శరీరంపై ఆనవాళ్లు ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. స్వాధీనం చేసుకున్న 3 సెల్‌ఫోన్లలోని కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పది బృందాలుగా ఏర్పడిన పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. దీనిలో భాగంగానే మరోసారి బావిలోకి దిగి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని నివేదికలు క్రోడీకరించాకే ఏం జరిగిందో తెలిసే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు ఫోరెన్సిక్‌ నివేదికలు రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

షాకింగ్ విషయాలు బయటపెట్టిన డాక్టర్…
జిల్లాలోని గొర్రకుంట బావిలో బయటపడ్డ తొమ్మిది మంది మృతి కేసులో సంచలన విషయాలను ఎంజీఎం ఫోరెన్సిక్ హెడ్ డాక్టర్ రజామాలిక్ బయటపెట్టారు. మక్సూద్ ఇంట్లోనే అందిరకీ మత్తు మందు ఇచ్చి సృహకోల్పోయాక… గోనెసంచుల్లో పెట్టి బావి వరకు తీసుకువచ్చి పడేశారని డాక్టర్ తెలిపారు. అందుకే అందరూ ఊపిరితిత్తుల్లోకి నీరు చేరి చనిపోయారన్నారు. ఘటనా స్థలంలో మత్తు ట్యాబ్లెట్లు, కూల్‌డ్రింక్స్ పోలీసులకు లభ్యమయ్యాయని తెలిపారు. ఈకేసులో బయటి వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు స్పష్టమౌతోందని డాక్టర్ రజామాలిక్ పేర్కొన్నారు.

బ్రేకింగ్.. బావిలో మృతదేహాలు.. వీడుతున్న మిస్టరీ
0 votes, 0.00 avg. rating (0% score)