మ‌హేష్ సితార‌కి బ్ర‌ద‌ర్‌లా ఉన్నాడే…న్యూ లుక్ అదిరిపోయిందిగా?

May 28, 2020 at 9:13 am

టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేష్‌బాబు సినిమా షూటింగ్ పనులలో తాను ఎంత బిజీగా ఉన్నా.. సమయం దొరికినప్పుడు మాత్రం తన కుటుంబంతో స్పెండ్ చేస్తుంటాడు. మొదటి నుంచి కూడా ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతా ఇస్తూ ఉంటాడు మహేష్. ముఖ్యంగా తన పిల్లలతో మ‌హేష్ ఎక్కువ స‌మ‌యాన్ని గ‌డుపుతుంటారు. వారికి ఫ్యామిలీ లైఫ్ మిస్సవ్వకుండా త‌గు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అందుకే ఆయన ఆన్ స్క్రీన్ లోను.. ఆఫ్ స్క్రీన్ లోనూ సూపర్ స్టారే అంటుంటారు ఆయన ఫ్యాన్స్‌. ఇప్పుడు లాక్‌డౌన్‌తో మ‌న హీరో పూర్తిగా స‌మ‌యాన్నంతా ఫ్యామిలీకే కేటాయించేశాడు. గౌతమ్ సితారాలతో కలిసి ఆడుకుంటూ చిన్న పిల్లాడిగా మారిపోతున్నాడు. అలానే వర్కౌట్స్ చేసుకుంటూ ఫిట్నెస్ మీద కూడా ఫోకస్ పెడుతున్నాడు.

మహేష్ ఒకవైపు సామాజిక అంశాలపై స్పందిస్తూనే మరోవైపు ఫ్యామిలీ టైమ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో సోషల్ మీడియా ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు త‌ను షేర్ చేసే పిక్స్ ద్వారా తెలియాజేస్తూనే ఉన్నాడు. డైలీ ఏదోఒక‌ పోస్ట్ పెడుతూ అభిమానులను ఖుషీ చేస్తూ వస్తున్నాడు. మహేష్ సతీమణి నమ్రత కూడా వారి అల్లరి చేసే వీడియోలను పోస్టు చేస్తూ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. తన పిల్లలతో మహేష్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ – గౌతమ్ ఇద్దరూ తండ్రీ కొడుకులు గా కాకుండా అన్నదమ్ముల్లా స్నేహితులు లాగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ మధ్య మహేష్ బాబు పోస్ట్ చేసే ఫోటోలు చూస్తుంటే మహేష్ ఏజ్ రోజు రోజుకి మ‌రింత తగ్గుతూ వస్తోందా అనే అనుమానం కలగుతోంది. మహేష్ బాబు ఇప్పుడు తన ఏజ్ ను రివర్స్ గేర్ లో పెట్టి వెనక్కి లాగేసారా అన్న అనుమానం ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ కు కలుగుతుంది.

తాజాగా మహేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పిక్ చూస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవ్వకుండా ఉండలేరు. కూతురు సితారతో అద్దం దగ్గర నిల్చొని మహేష్ దిగిన మిర్రర్ సెల్ఫీ అయితే మరింత పిచ్చెక్కిస్తుంది. ఇందులో ఈయన సితారకే అన్నయ్యలా ఉన్నాడంటే అతిశయోక్తి కాద‌ని చెప్పాలి. ఈ ఫోటో చూసిన మహేష్ అభిమానులు తెగ‌ ఖుషీ అవుతున్నారు. మహేష్ అన్నం తింటున్నాడా.. అందం తింటున్నాడా అనే డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు ఒకొక్క‌రు.

మ‌హేష్ సితార‌కి బ్ర‌ద‌ర్‌లా ఉన్నాడే…న్యూ లుక్ అదిరిపోయిందిగా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts