రైతు చేతిలో కోటి రూపాయ‌ల వ‌జ్రం… అసలు ట్విస్ట్ ఏమిటంటే?

May 23, 2020 at 11:41 am

దేవుడు వ‌ర‌మిచ్చినా పూజారి అడ్డుప‌డ్డాడు అంటారు కొన్ని సామెత‌లు. అలానే ఉంది ఈ రైతు విష‌యం కూడా వింటుంటే అలానే ఉంది. అనంత‌పురం జిల్లాకి సంబంధించిన రైతుకి కోటిరూపాయ‌లు విలువ చేసే ఒక వ‌జ్రం దొరికింది. అయితే దాని ఎలాగైనా గుట్టుచ‌ప్పుడు కాకుండా అమ్మి డ‌బ్బులు తీసుకుందాం అనుకున్నాడు. అదే విధంగా ఆ విష‌యాన్ని నా స్నేహితులు ఇద్ద‌రితో మాత్రం పంచుకున్నాడు. ఆ రైతు గుంటకతో భూమిని దున్నడంతో ఓ వజ్రం బయటపడింది. ఆ తర్వాత గ్రామంలోని ఇద్దరు వ్యక్తులతో కలిసి రహస్యంగా వజ్రాన్ని కర్నూలు జిల్లాలోని పెరవలిలో విక్రయించేందుకు ప్రయత్నించాడు. కానీ అక్కడ ధర విషయంలో కాస్త‌ తేడా రావ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. దీంతో రైతు గుత్తి ఆర్‌ఎస్‌లోని ఓ వ్యాపారికి రూ.30 లక్షలకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే రైతుకు వజ్రం దొరికిన విషయం బయటపడింది.

రైతుకు దొరికిన ఆ వజ్రం ధర రూ.కోటికి పైగా ఉంటుందట.. మధ్యవర్తులు వజ్రాల వ్యాపారితో కుమ్మక్కై రైతుకు తక్కువ ధర ఇచ్చినట్లు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైతుకు ఊరి శివారులో ఊటకల్లుకు వెళ్లే దారిలో వ్యవసాయ భూములు ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి భూమి మొత్తం పదును కావడంతో రైతు వ్యవసాయం పనులు ప్రారంభించాడు.

రైతు చేతిలో కోటి రూపాయ‌ల వ‌జ్రం… అసలు ట్విస్ట్ ఏమిటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)