ర‌ష్మిక స్కెచ్‌లు మాములుగా లేవుగా?

May 22, 2020 at 9:22 pm

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో ఉన్న హీరోయిన్ రష్మికమండ‌న్న‌. ఇప్పుడు ఈ క‌న్న‌డ భామ‌ టైం బాగా నడుస్తోంది. ఇండ‌స్ట్రీలో ఎవ్వర్నీ కదిలించినా రష్మిక జపమే చేస్తున్నారు. అందుకు కారణం లేక పోలేదు!? ఈ శాండిల్‌వుడ్ బ్యూటీ రష్మిక చేస్తున్న ప్రాజెక్టులన్నీ సక్సెస్ ట్రాక్‌లో పరుగులు తీస్తుంటే, టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేయడానికి పెద్ద స్కెచ్చే వేసుకుంటోందన్న మాట వినిపిస్తోంది. దర్శక, నిర్మాతలకు ఎంత అందుబాటులో ఉంటే అవకాశాలు అంత చేజారకుండా ఉంటాయన్నది ఆమె ఆలోచన.

జనవరిలో సరిలేరు నీకెవ్వరు హిట్‌ని ఎంజాయ్ చేసిన రష్మిక ఫిబ్రవరిలో భీష్మ హిట్‌ని ఎంజాయ్ చేసింది. మొన్నటి వరకూ తననంతా తెలుగమ్మాయే అనుకుంటున్నారంటూ మైండ్ ట్యూన్ డైలాగ్ వాడిన రష్మిక, తాజాగా ఇల్లు ఆలోచన బయటపెట్టడం చూస్తుంటే.. పెద్ద ప్రాజెక్టులు ఆమెకు వర్కౌటవుతున్నట్టే అని అంటున్నారు. అందులో ముఖ్యంగా జూ.ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేయబోయే ప్రాజెక్టులో రష్మికకు ఛాన్స్ ఖరారైనట్టే అంటున్నారు. రష్మికకు తెలుగులో వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. చాలా మంది ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆమెకు మంచి అవ‌కాశాలే ఇస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భీష్మ చిత్రానికి ఓకే చేసుకున్నప్పుడే హారిక అండ్ హాసిని బ్యానర్‌కూ ఓ సినిమాకు ఒప్పందం చేసుకున్నారన్న కథనం వినిపిస్తోంది. జూ.ఎన్టీఆర్ -త్రివిక్రమ్ కాంబో చిత్రాన్ని హారిక అండ్ హాసిని, కల్యాణ్‌రామ్‌లు సంయుక్తంగా నిర్మించనున్నారు. సో, హిట్ రన్‌లోవున్న రష్మికను ఈ ప్రాజెక్టుకు సెట్ చేసే అవకాశం లేకపోలేదు. అయితే, అల.. వైకుంఠపురములో సినిమాతో పూజా హెగ్డే సైతం త్రివిక్రమ్ ఇంప్రెషన్‌లో ఉంది. వీళ్లిద్దరిలో ఎవరు బోర్డులోకి వస్తారన్నది తేలాలి. సో, గట్టిగా ప్రయత్నిస్తే ఛాన్స్ ఉంటుందన్న ఆలోచనతో రష్మిక -హైదరాబాద్‌లో నివాసం ఉంటానన్న డైలాగ్ వదిలిందంటున్న వారూ లేకపోలేదు. ఏదేమైనా.. సరిలేరు నీకెవ్వరు, భీష్మ హిట్లుతో ఊపుమీదున్న రష్మిక.. తదుపరి స్టార్ హీరోల పక్కన ఛాన్స్‌ల కోసం గట్టిగా ట్రై చేస్తోంది. అల్ల అర్జున్, జూ.ఎన్టీఆర్ లాంటి హీరోల పక్కన ఛాన్స్‌లు పడితే.. రష్మికను అందుకోవడం కాస్త క‌ష్ట‌మే మ‌రి.

ర‌ష్మిక స్కెచ్‌లు మాములుగా లేవుగా?
0 votes, 0.00 avg. rating (0% score)