విల‌న్ పాత్ర‌లో ప్ర‌భాస్ న‌టిస్తే… రెమ్యూన‌రేష‌న్ ఎంతంటే?

May 18, 2020 at 7:06 pm

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం బాహుబలి. ఈ చిత్రంతో ప్యాన్ ఇండియా హీరోగా ప్రపంచ వ్యాప్తంగా సూపర్ స్టార్ అయిపోయినటువంటి ప్రభాస్ ఆ తరువాత సాహో అనే ప్యాన్ ఇండియా సినిమా చేసి తానేంటో మరొకసారి నిరూపించుకున్నారు. అయితే ఈ చిత్రం తెలుగులో పెద్దగా ఆడకపోయినప్పటికీ కూడా బాలీవుడ్‌‌లో మాత్రం 150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సాహో చిత్రంతో బాలీవుడ్ లో అవార్డులు వ‌ర్షం కూడా కురిసింది. ఎన్నో అవార్డుల‌ను దక్కించుకుంటున్నాడు ప్రభాస్… కాగా తాజాగా ప్రభాస్ కి ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఇక ఆయన్ని నేషనల్ హీరో అనాల్సిందే. సాహో తెలుగులో ఫ్లాప్ అయింది కానీ హిందీలో మాత్రం హిట్ కొట్టింది ఈ చిత్రం. అక్కడ నెగిటివ్ టాక్ వచ్చిన తర్వాత కూడా 150 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. దాంతో ప్రభాస్‌కు అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే పెరిగిపోయింది. అందుకే ఆయనతో ఎప్పుడెప్పుడు సినిమాలు చేద్దామా అని బాలీవుడ్ దర్శక నిర్మాతలు వేచి చూస్తున్నారు.

ఇప్పటికే ఆయన కోసం చాలా మంది దర్శకులు అడుగుతున్నారు. కథలు సిద్ధం చేస్తున్నామని హింట్ కూడా ఇస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ప్రస్తుతానికి తెలుగు ఇండస్ట్రీపైనే ఫోకస్ చేస్తున్నాడు. ఇక్కడి దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ప్ర‌భాస్‌ రాధాకృష్ణ కుమార్ సినిమా తర్వాత నాగ్ అశ్విన్‌ను లైన్‌లో పెట్టాడు ప్రభాస్. ఇది కూడా పాన్ ఇండియన్ ప్రాజెక్టే. పైగా క్రిమ్యూష్‌ మాదిరి సూపర్ పవర్స్ ఉన్న పాత్ర ఇది. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్‌కు బాలీవుడ్ నిర్మాత ఆదిత్య చోప్రా బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. బాహుబలి, సాహో సినిమాలు చూసిన తర్వాత ఈయన యాక్షన్ సినిమాలకు పర్ఫెక్ట్ సెట్ అవుతార‌ని నమ్మిన ఆదిత్య.. తాను నిర్మించబోయే ధూమ్ 4‌లో విలన్ పాత్ర కోసం ప్రభాస్‌ను ఒప్పించాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ కటౌట్ చూసి ఫిదా అయిపోయారు ఉత్తరాది అభిమానులు. ఆయ‌న విల‌న్ పాత్ర‌లో న‌టిస్తే 100కోట్లు రెమ్యూన‌రేష‌న్ ఇస్తారని స‌మాచారం.

ఇక దాంతో ప్రభాస్ విలనిజాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు ఆదిత్య చోప్రా. జాన్ అబ్రహాం, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ లాంటి హీరోలు చేసిన పాత్రను ఇప్పుడు ప్రభాస్ కోసం ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి దీనికి ఈయన నుంచి ఇంకా సమాధానమేదీ రాలేదు. ఇక విల‌న్ పాత్ర‌కి ప్ర‌భాస్ ఓకే అంటాడా లేదా అని అంద‌రూ వేచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈయన నటిస్తున్న రాధాకృష్ణ కుమార్ జాన్ సినిమాను కూడా హిందీలో విడుదల చేయబోతున్నారు. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. నాగ్ అశ్విన్ సినిమా 2022 సంక్రాంతికి రానుంది. ప్ర‌భాస్ క‌నుక ఒప్పుకుంటే ఆ తర్వాత ధూమ్ 4 ఉంటుందేమో మరి..?

విల‌న్ పాత్ర‌లో ప్ర‌భాస్ న‌టిస్తే… రెమ్యూన‌రేష‌న్ ఎంతంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts