వీధి కుక్క‌ల దాడిలో చిన్నారి మృతి

May 30, 2020 at 10:08 pm

చిన్న‌పిల్ల‌లు రోడ్డు పైన ఆడుకునేట‌ప్పుడు త‌ల్లిదండ్రులు ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నించుకోవాలి. లేక‌పోతే అనుకోని సంఘ‌ట‌న‌లు ఎన్నో ఎద‌ర‌వుతా ఉంటాయి. హైద‌రాబాద్ బోడుప్ప‌ల్‌లో వీధి కుక్క‌లు బాలిక పైన దాడి చేశాయి. దాంతో తీవ్రంగా గాయ‌ప‌డిన ఆరు సంవ‌ల్స‌రాల‌ బాలిక‌ని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చంగిచర్ల సుశీల టౌన్ షిప్‌లో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని బాలల హక్కుల సంఘం.. బోడుప్పల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు.

ఆరు సంవత్సరాల బాలిక అంగోత్ బేబీ వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడింది. స్థానిక ఆసుప‌త్రికి తీసుకువెళ్ళ‌గా..అక్కడ నుండి మరో ఆసుపత్రి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో యశోద ఆసుపత్రికి తరలించాలని వైద్యులు తెలిపార‌ని బాలిక తండ్రి అంగోత్ హోలీ చెప్పారు. కానీ యశోద హాస్పిటల్‌లో కూడా బాలికకు వైద్యం చేయలేదని వివరించారు. చివరకు నీలోఫర్ ‌కి పాపను తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. దీంతో బాల‌ల హ‌క్కుల సంఘం వీధికుక్క‌ల‌ను నిర్మూలించాలంటూ డిమాండ్ చేశారు.

వీధి కుక్క‌ల దాడిలో చిన్నారి మృతి
0 votes, 0.00 avg. rating (0% score)