హ‌వ్వా… ప‌న్నెండేళ్ళ‌ బాలుడు సెక్స్ ఛాటింగా…వామ్మో న్యూడ్ ఫొటోల‌తో?

May 22, 2020 at 7:34 pm

టెక్నాల‌జీ పెరిగే కొద్ది పిల్ల‌లు ఎంత దారుణంగా త‌యార‌వుతున్నారంటే..స్మార్ట్ ఫోన్లు, నెట్ వాడ‌కాలు ఎక్కువ‌య్యాక పిల్ల‌ల దృష్టి ఎక్కువ‌గా పోర్న‌వీడియోల పైనే ప‌డుతుంది. ఎంత చిన్న వ‌య‌సు పిల్ల‌లైనా స‌రే సెక్స్ గురించి తెలుసుకోవ‌డానికి ఎక్కువ ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. సోష‌ల్ మీడియా పెరిగిపోవ‌డంతో ప్ర‌తి ఒక్క‌రూ బాగా వాడుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా వాట్సాప్‌, ఫేస్‌బుక్ ఛాటింగ్‌ల‌కి అల‌వాటుప‌డుతున్నారు. దాంతో కొంత మంది ఎక్కువ‌గా సెక్స్ ఛాట్ చెయ్య‌డానికి ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాల‌ను వాడుతున్నారు. ఇటీవ‌లె ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి యూపీలో చోటు చేసుకుంది.

కవి నగర్ కి చెందిన యువతి(21) డిగ్రీ పూర్తి చేసి సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవుతోంది. అదే ప్రాంతానికి చెందిన బాలుడు(12) ఆరో తరగతి చదువుతున్నాడు. ఆ ఇద్దరూ ఓ లోకల్ స్కూల్ వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నారు. అలా ఆ గ్రూప్‌లో స‌ద‌రు యువతి ఫోన్ నంబర్ తెలుసుకున్న బాలుడు ఆమెతో ప్రైవేట్‌గా చాట్ చేయడం ప్రారంభించాడు. మొదట్లో సబ్జెక్ట్‌ గురించి ఎక్కువగా మాట్లాడేవాడు. అనంతరం ఆమె సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఫొటోలు డౌన్‌లోడ్ చేసి వాటిని మార్ఫింగ్ చేశాడు. అలా మార్ఫింగ్ చేసిన యువతి న్యూడ్ ఫొటోలను ఆమె సెల్‌ఫోన్‌కి పంపించడంతో యువతి ఒక్క‌సారిగా షాక్ అయింది.

అనంతరం అతను తనతో సెక్స్ చాట్ చేయాలంటూ మెసేజ్‌లు పంపాడు. లేకుంటే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగ‌డంతో..అంతేకాక తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో భయపడిపోయిన యువతి ఫోన్ స్విచాఫ్ చేసేసి పక్కన పడేసింది. యువతికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచాఫ్ అని వస్తుండడంతో ఆమె స్నేహితులు పేరెంట్స్‌కి ఫోన్ చేయడంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

బాలుడి దారుణాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో బాధితురాలితో కలసి పోలీసులను ఆశ్రయించారు. యువకుడు పంపిన అసభ్యకర ఫొటోలను యువతి పోలీసులకు అందజేసింది. అలాగే అతను పంపిన అసభ్యకర మెసేజ్‌ను చూపించి అతనిపై ఫిర్యాదు చేసింది. అయితే ఆరో తరగతి బాలుడు అవన్నీ ఎలా చేస్తాడని.. ఆమె అబద్ధం చెబుతోందంటూ నిందితుడి తల్లిదండ్రులు వాదిస్తున్నారు. దీంతో పోలీసులు ఐపీ అడ్రస్ కనుక్కునేందుకు యత్నిస్తున్నారు. సైబర్ టీమ్ పోలీసులు టెక్నికల్ అంశాలపై దృష్టి పెట్టారు. పిల్ల‌ల‌కు చిన్న వ‌య‌సులోనే ఫోన్‌లు అల‌వాటు చేస్తే ఇలాంటివ‌న్నీ ఎన్నో ఇబ్బందులు త‌ల్లిదండ్రులు ఎదుర్కోవ‌ల‌సి ఉంటుంది.

హ‌వ్వా… ప‌న్నెండేళ్ళ‌ బాలుడు సెక్స్ ఛాటింగా…వామ్మో న్యూడ్ ఫొటోల‌తో?
0 votes, 0.00 avg. rating (0% score)