ఇక‌పై అక్క‌డ కరోనా సోకితే 10 రోజులే చికిత్స… ఆపై పరీక్షలు లేకుండానే ఇంటికి

May 17, 2020 at 8:12 am

ప్ర‌స్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అగ్ర‌రాజ్యాలు సైతం ఈ మ‌హ‌మ్మారి ధాటికి అత‌లా కుత‌లం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 47 లక్షల మించిపోగా.. క‌రోనా‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3ల‌క్ష‌ల‌ను మించిపోయింది. ఇంతటి ఘోర కలిని ఊహించని ప్రపంచ దేశాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలీక గందరగోళంలో పడిపోయాయి. మ‌రోవైపు తెలంగాణ‌లోనూ గ‌త కొన్ని రోజులుగా క‌రోనా క్ర‌మంగా పెరుగుతోంది.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో క‌రోనా కేసులు 1509కి చేరిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఇలాంటి స‌మ‌యంలో తెలంగాణ రోగులకు చికిత్సా విధానం విషయంలో ఐసీఎంఆర్ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) తాజాగా నిర్దేశించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేయనున్నామని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ వెల్ల‌డించారు. ఐసీఎంఆర్ ప్ర‌కారం.. క‌రోనా సోకితే 10 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేస్తారు. అపై ఎటువంటి పరీక్షలు లేకుండానే డిశ్చార్జ్ చేసి, వారం రోజుల పాటు హోమ్ ఐసొలేషన్ లో ఉంచుతార‌ట‌.

అలాగే ఇతర దీర్ఘకాలిక సమస్యలు ఉంటేనే ఆసుపత్రిలో చికిత్స అందించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇక హోమ్ ఐసొలేషన్ సూచనల ప్రకారం, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కాంటాక్ట్ లకు వ్యాధి లక్షణాలు కనిపించకుంటే, ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. వారిని ఓ ప్రత్యేక గదిలో 17 రోజులు పర్యవేక్షణలో ఉంచి, రోగులకు సాయంగా ఓ వ్యక్తిని ఉంచి, అతనికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లు అందిస్తామని, వారిని వైద్య బృందాలు రెండు పూటలా పర్యవేక్షిస్తారని, ఆ కుటుంబానికి అవసరమైన నిత్యావసరాలను స్వయంగా అందిస్తామని ఈట‌ల వెల్ల‌డించారు.

ఇక‌పై అక్క‌డ కరోనా సోకితే 10 రోజులే చికిత్స… ఆపై పరీక్షలు లేకుండానే ఇంటికి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts