అల‌ర్ట్.. అల‌ర్ట్‌.. తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!!

May 22, 2020 at 3:22 pm

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అన్ని దేశాలు ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు కుదేల్ అవుతున్నాయి. ఇక ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. నివార‌ణ‌పై అన్ని దేశాలు దృష్టి సారించాయి. ఈ క్ర‌మంలోనే ప‌లు దేశాలు క‌రోనాకు అడ్డుక‌ట్ట వేసేందుకు లాక్‌డౌన్ విధించారు. ఈ లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు మిన‌హా.. మిగిలిన అన్ని సంస్థ‌లు మూత‌ప‌డ్డాయి. విద్యార్థుల‌ ప‌రీక్ష‌లు కూడా వాయిదా ప‌డ్డాయి.

అయితే తాజాగా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. హైకోర్టు ఇటీవల జారీచేసిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. జూన్‌ 8 నుంచి జూలై 5వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలన్నీ ఉదయం 9.30 నుంచి మధ్యాహం 12.15 గంటల వరకు జరుగనున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతిపరీక్షకు రెండు రోజుల వ్యవధి వచ్చేలా షెడ్యూల్‌ను రూపొందించారు.

అలాగే కరోనా నేపథ్యంలో అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్తలను చేపడుతున్నారు. విద్యార్థులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరి అన్నారు. అంతేకాకుండా క్లాసుకు 20 మంది విద్యార్థులను మాత్రమే ఉంటారు. ప్రతీ ఎగ్జామ్ సెంటర్ లోనూ హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచనున్నారు. ఇక ష‌డ్యూల్ విష‌యానికి వ‌స్తే.. జూన్ 8న ఇంగ్లీష్ పేపర్ 1, 11న ఇంగ్లీష్ పేపర్ 2, 14న మ్యాథ్స్ పేపర్ 1, 17న మ్యాథ్స్ పేపర్ 2, 20న సైన్స్ పేపర్ 1, 23న సైన్స్ పేపర్ 2, 26న సోషల్ పేపర్ 1, 29న సోషల్ పేపర్ 2 పరీక్షలను నిర్వహించనున్నారు.

అల‌ర్ట్.. అల‌ర్ట్‌.. తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts