పెళ్లి కోసం ఒంటరిగా 120 కిలోమీటర్లు నడిచి వెళ్ళింది…!

May 23, 2020 at 7:33 pm

లాక్ డౌన్ ప్రభావం బాగా పడిన వాటిల్లో ప్రధానంగా చెప్పుకునేది పెళ్ళిళ్ళు. చాలా మందికి పెళ్లి కుదిరినా సరే పెళ్లి అయ్యే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. దీనితో చాలా మంది జాగ్రత్తగా వివాహాలు చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక యువతీ పెళ్లి కోసం 120 కిలోమీటర్లు నడిచి వెళ్ళడం విశేషం. ఉత్తరప్రదేశ్‌లో కాన్పూరుకు చెందిన 20 ఏళ్ల యువతి గోల్డీకి ఇటీవల కన్నౌజ్‌కు చెందిన యువకుడు వీరేంద్ర కుమార్ తో వివాహం నిశ్చయించారు.

ఈ నెల 4న వివాహం జరగాలి. అయితే కరోనా తీవ్రత నేపధ్యంలో లాక్ డౌన్ ఉంది కాబట్టి వివాహం జరగలేదు. దీనితో వివాహాన్ని కుటుంబ సభ్యులు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇక ప్రజా రవాణా కూడా మూసి వేసారు. దీనితో ఎం చెయ్యాలో అర్ధం కాలేదు. అయితే కాబోయే భార్యా భర్తలు ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూనే ఉన్నారు. కాన్పూరులోని లక్ష్మీపూర్ తాలూకాలో గోల్డీ నివాసం ఉంటుంది.

లక్నోకు 120 కిలోమీటర్ల దూరంలో కన్నౌజ్‌లోని బైసాపూర్‌లో నివసించే వీరేంద్ర ఇంటికి నడిచి వెళ్లి వివాహం చేసుకోవాలి అని భావించింది. నడవడం మొదలుపెట్టి అతని ఇంటికి వెళ్ళింది. ఏ సమాచారం లేకుండా గోల్డీ వెళ్ళడం చూసి పెళ్లి కొడుకు కుటుంబం షాక్ అయింది. వెంటనే విషయం అర్ధం చేసుకుని రెండు కుటుంబాలు కూడా పెళ్లి చేసాయి. ఆలయంలో మాస్క్ లు ధరించి ఈ వివాహాన్ని జరిపించారు.

పెళ్లి కోసం ఒంటరిగా 120 కిలోమీటర్లు నడిచి వెళ్ళింది…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts