సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు అరెస్ట్‌.. ఉలిక్కి పడిన టాలీవుడ్..!!

May 27, 2020 at 2:38 pm

శ్యామ్ కె. నాయుడు టాలీవుడ్‌లో పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ల‌లో ఒకరు. ఈయన సోదరుడు ఛోటా కె. నాయుడు కూడా ప్రముఖ చాయాగ్రాహకులుగా పనిచేసారు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన సినిమాల్లో చాలావాటికి ఈయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసారు. పోకిరి, బిజినెస్ మెన్, కెమెరామెన్ గంగతో రాంబాబు తో పాటు అనేక సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించారు.

అలాంటి శ్యామ్ కె. నాయుడు తాజాగా అరెస్ట్ అయ్యాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ కెమెరామెన్ శ్యామ్ కె నాయుడుపై హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని తనను మోసం చేశాడంటూ సినీ నటి సాయి సుధ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, అర్జున్ రెడ్డి చిత్రంలో సాయి సుధ సపోర్టింగ్ రోల్ పోషించారు. అయితే ప్ర‌స్తుతం శ్యామ్ కె నాయుడిపై కేసు న‌మోదై.. అరెస్ట్‌ కావడంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కి పడింది.

సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు అరెస్ట్‌.. ఉలిక్కి పడిన టాలీవుడ్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts