బ్రేకింగ్‌: సినీ నటి వాణిశ్రీ కుమారుడు హఠాన్మరణం

May 23, 2020 at 11:49 am

సినీ న‌టి వాణిశ్రీ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె కుమారుడు అభినయ్‌ వెంకటేశ్‌ కార్తీక్(36) ఈ రోజు తెల్లవారు జామున హ‌ఠార్మ‌ర‌ణం చెందారు. వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేష్ గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.. నిద్రలో ఉండగానే ఆయనకు గుండెపోటు వచ్చినట్లు సమాచారం. దాంతో ఆయన తుది శ్వాస విడిచాడు.

 

ఊటీలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న ఆయన.. ప్యాలెస్ పనుల నిమిత్తం చెంగల్‌పట్టుకు వెళ్లారు. ఆ రాత్రి తన కుమారుడితో సరదగా గడిపిన వెంకటేశ్.. ఉదయం విగతజీవుడిగా మారారని సన్నిహితులు తెలిపారు. అభినయ్ మృతదేహాన్ని చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి తీసుకురావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అభిన‌య్‌కు భార్య, ఓ కుమారుడు (4) ఉన్నాడు. అభినయ్ సతీమణి కూడా వైద్యురాలేనని సన్నిహితులు తెలిపారు.

సావిత్రి మనవరాలి ఆసుపత్రిలో ఆమె పని చేస్తోందన్నారు. అభినయ్ అంత్యక్రియలు ఇవాళ జరుగుతాయని చెప్పారు. కాగా, వాణిశ్రీకి కుమారుడు, కుమార్తె సంతానం. వాణిశ్రీ కుమారుడు హఠాన్మరణంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఈ క్ర‌మంలోనే సినీప్ర‌ముఖులు వాణిశ్రీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

బ్రేకింగ్‌: సినీ నటి వాణిశ్రీ కుమారుడు హఠాన్మరణం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts