ఆ ఒక్క ప‌దం వ‌ల్ల‌ సొంత పార్టీ నేతపైనే విరుచుకు ప‌డుతున్న‌ వైసీపీ ఫ్యాన్స్..!!

May 28, 2020 at 8:07 am

ఇటీవ‌ల వైసీపీ ప్ర‌భుత్వానికి హైకోర్డులో దెబ్బ మీద దెబ్బ త‌గులుతున్న సంగ‌తి తెలిసిందే. జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా హైకోర్టు పలు తీర్పులు ఇవ్వడంపై వైసీపీ నాయకులతో పాటు కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. దీంతో హైకోర్టుతో పాటు పలువురు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టునే ప్రధాన ప్రతిపక్షంగా మారిందంటూ ట్రోల్స్ మొద‌లుపెట్టారు.

అయితే ఈ అంశంపై లాయర్ లక్ష్మీనారాయణ హైకోర్టుకు ఫిర్యాదు చేయగా.. సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. ఈ క్ర‌మంలోనే మొత్తం 49మందిని గుర్తించి వారికి కోర్టు నోటీసులు జారీ చేసింది. వీరిలో వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో పాటూ మరికొందరు ఉన్నారు. వారిలో ఏడుగురిపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. అయితే తాజాగా ఓ ఛానెల్ చర్చలో పాల్గొన్న వైసీపీ నేత అద్దేపల్లి శ్రీధర్.. ఈ వివాదం తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు.

కానీ, అది మొత్తానికి బెడిసికొట్టింది. శ్రీ‌ధ‌ర్ దీనిపై మాట్లాడుతూ.. కోర్టు వ్యవహారాలపై తెలియక తప్పు చేశారంటూ వైసీపీ ఫ్యాన్స్‌ను వెనకేసుకునే ప్రయత్నం చేశారు. ఇదే టైమ్‌లో.. హైకోర్టు నుంచి నోటీసులు అందుకున్న 49 మందిలో 98శాతం ఇల్లిటరేట్స్‌ అని, వారికి మీడియా ముందు, సోషల్ మీడియాలో ఎలా మాట్లాడాలో, ఏం రాయాలో తెలీదని అన‌డంతో.. వైసీపీ శ్రీ‌ధ‌ర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌మ్మ‌ల్ని ఇల్లిటరేట్స్ అంటారా..? అంటూ ఆయనపై తీవ్రంగా విరుచుకు ప‌డుతున్నారు. ఇలా మేలు చేయాల‌ని వ‌చ్చిన శ్రీ‌ధ‌ర్‌కు సొంత పార్టీ ఫ్యాన్స్ నుంచే షాక్ త‌గిలింది.

ఆ ఒక్క ప‌దం వ‌ల్ల‌ సొంత పార్టీ నేతపైనే విరుచుకు ప‌డుతున్న‌ వైసీపీ ఫ్యాన్స్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts