మరోసారి భారీ విరాళం ప్ర‌క‌టించిన‌‌ అక్షయ్ కుమార్‌!

May 28, 2020 at 11:49 am

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే కరోనా వైరస్ ను కట్టడి చేసే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ దేశంలో అన్ని రంగాల కార్య కలాపాలను స్తంభింపజేసింది. దీంతో ఈ ప్రభావం అన్ని రంగాలపై బాగానే చూపించింది.

క‌రోనా పై పోరులో మేము సైతం అంటూ.. ఎంద‌రో ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. రాజ‌కీయ నేత‌లు, పారిశ్రామిక‌వేత్త‌లు, సినీ సెల‌బ్రిటీలు భారీ విరాళాలు అంద‌జేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ మ‌రోసారి త‌న గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన సినీ కళాకారులు, కార్మికులకు అక్షయ్ అండగా నిలిచారు. ఆయన తాజాగా సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(సింటా)కు రూ. 45 లక్షల విరాళాన్ని అందించారు.

దీని ద్వారా 1500 మందికి ఒక్కొక్కరికీ రూ. 3 వేల చొప్పున ఆర్ధిక సాయం అందనున్న‌ట్టు తెలుస్తోంది. కాగా, కరోనాపై పోరులో భాగంగా ఇప్పటికే పీఎం కేర్స్ ఫండ్ కు, ముంబై మునిసిపల్ కార్పొరేషన్, ముంబై పోలీస్ ఫౌండేషన్లకు భారీ విరాళాలు ఇచ్చిన ఈ రియల్ హీరో.. తాజాగా లాక్ డౌన్ కారణంగా కష్టాలు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు రావ‌డంతో.. నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

మరోసారి భారీ విరాళం ప్ర‌క‌టించిన‌‌ అక్షయ్ కుమార్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts