లాక్‌డౌన్ పొడిగిస్తే ఆ తిప్ప‌లు త‌ప్పవంటున్న‌ ఆనంద్ మహీంద్రా..!!

May 26, 2020 at 11:14 am

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు విశ్వ‌రూపం చూపిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. దీనిని క‌ట్ట‌డి చేయడం ప్ర‌భుత్వాల‌కు మ‌రింత పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఇక ఇప్ప‌టికే క‌రోనా కాటుకు మూడు ల‌క్ష‌ల మందికి పైగా బ‌లైపోయారు. మ‌రోవైపు కరోనా వైరస్‌ను నివారించేందుకు ప‌లు దేశాల‌తో పాటు భార‌త్‌లోనూ లాక్‌డౌన్ విధించ‌డంతో.. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. చాలా రంగాలు క‌రోనా దెబ్బకి చతికిలపడ్డాయి. వ్యాపారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. లాక్‌డౌన్ వల్ల ఎప్పుడూ ఎదుర్కొనని ఆర్థిక సవాలును ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా లాక్‌డౌన్ వల్ల కలిగే నష్టాలను చెబుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మాట్లాడుతూ.. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను మరో సారి పొడిగిస్తే ఆర్థిక వినాశనం తప్పదని హెచ్చరించారు. అంతేకాదు, లాక్‌డౌన్ పొడిగింపుతో వైద్యపరమైన సంక్షోభం కూడా తలెత్తే అవకాశం ఉందన్నారు.

ఇక మరోసారి లాక్‌డౌన్ పొడిగింపు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని కుండబద్దలు కొడుతూ ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఈ సందర్భంగా గతంలో తాను చేసిన ట్వీట్లను ప్రస్తావించారు. లాక్‌డౌన్‌ను పొడిగిస్తే కనుక దాని ప్రతికూల ప్రభావం ప్రజల మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, కోవిడ్‌యేతర రోగులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యే అవకాశం ఉందంటూ గతంలో ఆయన చేసిన ట్వీట్లను గుర్తు చేశారు. ఈ క్ర‌మంలోనే సమగ్రమైన విధానాన్ని రూపొందించి లాక్‌డౌన్ ఎత్తివేయడమే సరైన నిర్ణయమని తేల్చి చెప్పాలి.

లాక్‌డౌన్ పొడిగిస్తే ఆ తిప్ప‌లు త‌ప్పవంటున్న‌ ఆనంద్ మహీంద్రా..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts