ఉద్యోగం కోసం వెళ్ళిన యువ‌తికి చేదు అనుభ‌వం…అస‌లు ఏం జ‌రిగిందంటే?

May 28, 2020 at 8:32 am

స్త్రీలు ప్ర‌తీ చోట గౌర‌వించ‌బ‌డాల‌ని ఎప్పుడూ చెబుతుంటారు. బ‌స్సుల సీట్ల మీద ఇంకా ప్ర‌తీ ప‌బ్లిక్ స్పీచ్‌ల‌లో ఎంతో మంది చెబుతారు. కానీ ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చేస‌రికి వాళ్ళ‌కి గౌర‌వం కాదు క‌దా అనీస భ‌ద్ర‌త కూడా నేడు చాలా క‌ష్ట‌మ‌యిపోయింద‌ని చెప్పాలి. ఒక స్త్రీ త‌న‌ను తాను బ్ర‌తికించుకోవ‌డానికి ఎంత క‌ష్ట‌ప‌డ‌వ‌ల‌సి వ‌స్తుందంటే ఈ మగ మృగాళ్ళ మ‌ధ్య దిన దిన గండంగా మారింది ఆమె జీవితం. అనంత‌పురం జిల్లాలో ఇలాంటి విచార‌క‌ర ఘ‌ట‌నే ఒక‌టి చోటు చేసుకుంది.

అనంత‌పురం జిల్లాకి చెందిన ఓ యువ‌తి చిన్నవ‌య‌సులోనే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోవ‌డంతో ప‌ని కోసం వెత‌క‌డం మొద‌లు పెట్టింది. యువతి ఆర్థిక అవసరాల గురించి తెలుసుకున్న పద్మావతి ప్రొద్దుటూరులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి కొద్దిరోజుల క్రితం బస్సు ఎక్కించింది. ప్రొద్దుటూరు చేరుకున్న ఓ మహిళ వచ్చి ఆమెను తీసుకెళ్లి ఓ ఇంట్లో ఉంచింది. అప్ప‌టికే మూడు రోజులు కావ‌డంతో ఉద్యోగం ఏమ‌యింద‌ని ఆ యువ‌తి నిల‌దీసింది. ఇక్కడ ఉద్యోగాలేమీ లేవని.. వ్యభిచారం చేయాలని ఆమె చెప్పడంతో యువతి ఒక్క‌సారిగా షాకైంది.

తాను ఆపదలో ఉన్నానని గ్రహించి వెంట‌నే ఆ యువ‌తి అప్ర‌మ‌త్త‌మ‌యింది. ఎంతో చాకచక్యంగా తప్పించుకుని తనకు తెలిసిన ఓ మహిళ వద్ద ఆశ్రయం పొందింది. మరోవైపు యువతి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు అనంతపురం త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె కోసం గాలించి అనంతపురం పోలీసులు ప్రొద్దుటూరులో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తనకు జరిగిన అనుభవాన్ని యువతి వివరించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్ర‌స్తుతం స‌మాజంలో ఎలాంటి ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయంటే ఎవ్వ‌రినీ న‌మ్మ‌డానికి లేకుండా పోయింది. సాటి ఆడ‌దాన్ని కూడా న‌మ్మ‌డం క‌ష్ట‌మైన ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి.

ఉద్యోగం కోసం వెళ్ళిన యువ‌తికి చేదు అనుభ‌వం…అస‌లు ఏం జ‌రిగిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts