జ‌గ‌న్‌ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం….!!

May 30, 2020 at 8:42 am

క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు ముందున్న ప్ర‌ధాన స‌మ‌స్య ఇది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ క‌రోనా భూతం.. అనాతి కాలంలోనే దేశ‌దేశాలు విస్త‌రించింది. ఈ క్ర‌మంలోనే ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. మ‌రోవైపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు సంఖ్య 58 ల‌క్ష‌లు దాటేసింది. ఇక ఈ మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. దీనిని క‌ట్ట‌డి చేయ‌డం పెద్ద స‌వాల్ మారింది. ఈ క్ర‌మంలోనే ఎలాగైనా క‌రోనాను నియంత్రించేందుకు లాక్‌డౌన్ విధించింది. అందులో భార‌త్ కూడా ఒక‌టి

అయితే లాక్‌డౌన్ విధించింది రెండు నెల‌లు గ‌డుస్తుండ‌డంతో.. ఇప్పుడిప్పుడే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ నుంచి కొన్నిటికి స‌డ‌లింపులు ఇస్తోంది. ఇక తాజాగా మరిన్ని సడలింపులను ప్రకటించింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ముఖ్యంగా రవాణా రంగానికి ఈ మినహాయింపులు వర్తిస్తాయని తెలిపింది. రాష్ట్రంలో ఆటోలు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది.

యాబై శాతం సీట్లతో ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ప్రయాణీకులకు అనుమతి ఇచ్చింది. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ప్రయాణాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇప్ప‌టికే ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో చాలావరకు మినహాయింపులు ఇచ్చింది. అయితే ప్ర‌స్తుతం ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,874కు చేరుకుంది. అయితే వీరిలో 777 మంది మాత్రమే హాస్ప‌ట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

జ‌గ‌న్‌ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం….!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts