కరోనా పరీక్షల విష‌యంలో మ‌ళ్లీ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన ఏపీ..!!

May 25, 2020 at 7:33 am

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎక్క‌డో చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క‌ర క‌రోనా.. ప్ర‌స్తుతం అన్ని దేశాల‌ను త‌న గుప్పెట్లో పెట్టుకుంది. మ‌రోవైపు క‌రోనా కంటికి క‌నిపించ‌క‌పోయినా.. చేతిలో అయుధం లేక‌పోయినా.. దేశ‌దేశాలు ఈ మ‌హ‌మ్మారితో యుద్ధం చేస్తేనే ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా దూకుడు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. రోజురోజుకు క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 54 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

అలాగే మ‌ర‌ణాల సంఖ్య 3.50 ల‌క్ష‌ల‌కు చేర‌వ అవుతోంది. ఇంతటి ఘోర కలిని ఊహించని ప్రపంచ దేశాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలీక గందరగోళంలో పడిపోయాయి. ఇదిలా ఉంటే.. కరోనా పరీక్షల విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ళ్లీ రికార్డు బ‌ద్ద‌లు కొట్టింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు 3 లక్షలు దాటినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు ఏపీలో 3,04,326 పరీక్షలు జరిగాయని ఆయన వివరించారు.

ప్రతి 10 లక్షల జనాభాకు 5,699 పరీక్షల్లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని ఆయన అన్నారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 1807 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా రికార్డ్ స్థాయిలో 68 శాతం రికవరీ రేటు నమోదైంది. అలాగే ప్ర‌స్తుతం ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,627కు చేరింది. మ‌రోవైపు, రాష్ట్ర‌వ్యాప్తంగా 764 మాత్రమే యాక్టివ్ కేసులు ఉండగా., 56 మంది మరణించారు.

కరోనా పరీక్షల విష‌యంలో మ‌ళ్లీ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన ఏపీ..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts