కరోనాకి వ్యాక్సిన్ తయారు చేస్తున్న మరో దేశం, ఈ ఏడాది చివర్లో…?

May 27, 2020 at 9:48 am

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు వ్యాక్సిన్ కోసం అన్ని దేశాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. వేగంగా వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకు రావడానికి గానూ కష్టపడి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో వ్యాక్సిన్ ని ఆస్ట్రేలియా లో ప్రయోగ శాలలో పరిక్షిస్తున్నారు. అమెరికా బయోటెక్నాలజీ సంస్థ నోవావ్యాక్స్‌ ఈ ప్రకటన చేసింది. ఈ ఏడాది చివర్లోగా దీనిపై ప్రయోగాలను పూర్తి చేసి విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొంది.

 

ఎన్‌వీఎక్స్‌-కోవ్‌2373 అని దీనికి పేరు కూడా పెట్టారు. దీనిపై మాట్లాడిన నోవావ్యాక్స్‌ పరిశోధన విభాగం అధిపతి గ్రెగోరి గ్లెన్‌… మొదటి దశలో ప్రయోగంగా దీనిని 131 మందికి ఇస్తామన్నారు. మంగళవారం ఆరుగురు పరీక్షార్థులకు దీన్ని ఇచ్చామని ఆయన వివరించారు. ఈ వ్యాక్సిన్‌ సురక్షితమేనా, సమర్థంగా పనిచేస్తోందా అన్నది పరిశీలిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు దాదాపు వంద పరిక్షలు చేసారు.

 

అటు చైనా కూడా దీనిని తయారు చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికి అయినా దీనితో విపత్తు వస్తుందని కాబట్టి వ్యాక్సిన్ అనేది చాలా అవసరమని చైనా సహా పలు దేశాలు భావిస్తున్నాయి. ఇక మన దేశంలో కూడా దీనిని ప్రయోగించడానికి తీవ్రంగా కష్టాలు పడుతున్నారు. బ్రిటన్ కూడా దీని కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నా సరే ఇప్పటి వరకు ముందు అడుగు మాత్రం పడలేదు.

కరోనాకి వ్యాక్సిన్ తయారు చేస్తున్న మరో దేశం, ఈ ఏడాది చివర్లో…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts