బ్రేకింగ్: వైసీపీ కార్యకర్తలకు మరో షాక్ ఇచ్చిన హైకోర్ట్

May 29, 2020 at 2:46 pm

ఆంధ్రప్రదేశ్ లో హైకోర్ట్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ కార్యకర్తలకు హైకోర్ట్ మరోసారి షాక్ ఇచ్చింది. దాదాపు 45 మందికి నోటీసులు ఇచ్చింది ఏపీ హైకోర్ట్. వీరిలో వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్ కూడా ఉన్నారు. ఆయన ఇటీవల హైకోర్ట్ తీర్పులు వచ్చిన సమయంలో కాస్త ఆవేశ పడి విమర్శలు చేసారు. దీనితో వాటిని సుమోటో గా తీసుకున్న ఏపీ హైకోర్ట్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు ఇచ్చింది.

హైకోర్ట్ పై అలాగే న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారి విషయంలో హైకోర్ట్ ఇప్పుడు ఆగ్రహంగా ఉంది. కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే రెండు రోజుల క్రితం 49 మంది పై కేసులు నమోదు చేయించింది ఏపీ హైకోర్ట్. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇచ్చింది. దీనితో ఒక్కసారిగా షాక్ అయ్యారు వైసీపీ కార్యకర్తలు. హైకోర్టు న్యాయమూర్తులపై, న్యాయవ్యవస్థ పై తప్పుడు…

వ్యాఖ్యలు చేసిన మరో 44 మందికి నోటీసులు ఇచ్చింది. పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాస్, పంచ్ ప్రభాకర్ సహా 44 మందికి నోటీసులు ఇచ్చింది. ఇదే కేసులో రెండ్రోజుల క్రితం 49 మందికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు కేసులు కూడా నమోదు చెయ్యాలని స్పష్టంగా చెప్పింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ కేసులు నమోదు చేసింది. కొందరిని అదుపులోకి కూడా తీసుకున్నారు అధికారులు. దీనితో ఇప్పుడు వైసీపీ కార్యకర్తల్లో భయం మొదలయింది.

బ్రేకింగ్: వైసీపీ కార్యకర్తలకు మరో షాక్ ఇచ్చిన హైకోర్ట్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts