మద్య నియంత్రణ దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ మ‌రో అదిరిపోయే ప్లాన్..‌!!

May 30, 2020 at 7:50 am

తాను అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మద్య నియంత్రణ దిశగా ప్రభుత్వం మరిన్ని అడుగులు వేస్తోంది. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా, దుకాణాల వద్ద రద్దీని తగ్గించేలా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అమల్లో కష్టమైనా, ఆర్థికంగా నష్టమైనా మద్య నియంత్రణకే ఏపీ ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది.

ఇక తాజాగా ఏపీ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మద్యం, మాదక ద్రవ్యాల విమోచనా కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం వేదికగా డిజిటల్ విధానంలో శుక్రవారం ఈ కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. మాదకద్రవ్యాల వినియోగ తగ్గింపులో భాగంగా వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహకారంతో విభిన్న ప్రతిభావంతులు, లింగమార్పిడి, వయోవృద్దుల విభాగం రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.

ఇందులో భాగంగా 15 ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, వీటి నిర్వహణ కోసం సంవత్సరానికి 4.98 కోట్లు వ్యయం చేయనున్నామని ప్ర‌భుత్వం తెలిపింది. దశలవారిగా మద్య నిషేదం అమలుకు సిఎం నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో ఈ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మద్య నియంత్రణ దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ మ‌రో అదిరిపోయే ప్లాన్..‌!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts