ఏపీలో రైతుల‌కు మ‌రో అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్..!!

May 26, 2020 at 3:43 pm

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను ముప్ప‌తిప్ప‌లు పెట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు అటు ప్ర‌జ‌లు, ఇటు ప్ర‌భుత్వాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా అగ్ర‌రాజ్యం అమెరికాలో క‌రోనా విల‌య‌తాండ‌వం సృష్టిస్తోంది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. మ‌రోవైపు భార‌త్‌లోనూ క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి స‌మ‌యంలోనూ ఏపీ రైతులకు సీఎం జగన్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు.

ఈ ఖరీఫ్ నుంచే ఉచితంగా బోర్లు వేయిస్తామని సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. మ‌రియు ఉచిత కరెంట్‌ ద్వారా ప్రతి రైతుకు రూ.49 వేలు లబ్ధి చేకూరుతోందని వివరించారు. దీని వల్ల ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వంపై రూ.8,800 కోట్లు భారం పడుతుందన్నారు. పగటిపూట కరెంట్‌ ఇచ్చేందుకు రూ.1,700 కోట్లతో ఫీడర్లను ఆధునీకరించామని, ఈ ఖరీఫ్‌ నాటికి 82 శాతం ఫీడర్లలో 9 గంటల ఉచిత విద్యుత్‌ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. మిగిలిన 18శాతం రబీ నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. ఆక్వా రైతులకు సైతం రూపాయిన్నరకే కరెంట్‌ ఇస్తున్నామని వివరించారు.

వైసీపీ ప్రభుత్వ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న మేధోమథన సదస్సుల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న ఆయన.. రైతులకు చెప్పిన దానికంటే ఎక్కువే ఇచ్చామని స్పష్టం చేశారు. ఈ క్ర‌మంలోనే రైతులు పండించే 30 శాతం పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఆ పంటలను జనతా బజార్ల ద్వారా విక్రయిస్తామని.. ఆర్‌బీకేలలో ల్యాబ్‌లు, కియోస్క్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

ఏపీలో రైతుల‌కు మ‌రో అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts