బ్రేకింగ్: వైసీపీ ఎంపీకి ఏపీ హైకోర్ట్ నోటీసులు…!

May 26, 2020 at 6:50 pm

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి హైకోర్ట్ వరుస షాక్ లు ఇస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అటు ఏపీ సర్కార్ ఇటు వైసీపీ నేతలు కూడా కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో గత పది రోజుల్లో చూస్తే దాదాపు 10 వ్యవహారాలలో ఏపీ హైకోర్ట్ కి షాక్ తగిలింది. డాక్టర్ సుధాకర్, ఎల్జీ పాలిమర్స్ సహా కొన్నింటి పై ఏపీ సర్కార్ పై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇది పక్కన పెడితే ఇప్పుడు వైసీపీ నేతలు తమకు వ్యతిరేకంగా తీర్పులు రావడంపై ఆగ్రహంగా ఉంటూ హైకోర్ట్ పైనే నేరుగా సోషల్ మీడియాలో సహా మీడియా సమావేశాల్లో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు కొందరు అయితే మరింత దారుణంగా హైకోర్ట్ ని విమర్శించారు. దీనిపై ఏపీ హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు అయింది. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తో పాటుగా…

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సహా 49 మందికి హైకోర్ట్ నోటీసులు ఇచ్చింది. ఇక విచారణను మూడు వారాల పాటు హైకోర్ట్ వాయిదా వేసింది. వివాదాస్పద వ్యాఖ్యలను న్యాయస్థానం క్లుప్తంగా పరిశీలించింది. కొందరు హైకోర్ట్ లో కొన్ని కులాలు ఉన్నాయి అంటూ కూడా వ్యాఖ్యలు చేసారు. దీనిపై రాష్ట్ర హైకోర్ట్ అసహనం వ్యక్తం చేస్తూ నోటీసులు ఇచ్చింది. వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

బ్రేకింగ్: వైసీపీ ఎంపీకి ఏపీ హైకోర్ట్ నోటీసులు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts