టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలపై బాలయ్య హాట్ కామెంట్స్ !

May 28, 2020 at 2:10 pm

తెలుగు నట సింహాం, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగుజాతి కీర్తి కిరీటాలను దశదిశలా వ్యాపింప చేసిన ఘనుల్లో ఒకరు నందమూరి తారక రామారావు గారు నేడు 90వ జ‌యంతి. అయితే ఎన్టీఆర్ జయంతి వేడుకలు లాక్ డౌన్ కారణంగా నిరాడంబరంగా జరుగుతున్న వేళ, హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ, హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన బాల‌య్య‌ టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలపై హాట్ కామెంట్స్ చేశారు.

సినిమా ఇండస్ట్రీ ప్రతినిధులు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన విషయం తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. పత్రికల్లో చూసి తాను ఈ విషయాన్ని తెలుసుకున్నానని, సాధ్యమైనంత త్వరగా షూటింగ్స్ తిరిగి మొదలైతే, కష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమకు కొంతైనా మేలు కలుగుతుందన్నారు. భవిష్యత్తులో తక్కువ మంది సిబ్బందితో భౌతిక దూరం పాటిస్తూ సినిమాలు తీయాల్సి వుంటుందని తెలిపారు.

ప్ర‌స్తుతం బాల‌య్య చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి బాలయ్య చేసిన వ్యాఖ్యలపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. కాగా, కరోనా లాక్‌డౌన్‌ వేళ సిని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే షూటింగ్‌ల గురించి మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో టాలీవుడ్‌లోని కొందరు సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే.

టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలపై బాలయ్య హాట్ కామెంట్స్ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts