హైదరాబాద్‌లో కూర్చిని భూములు పంచుకుంటున్నారా..? బాల‌య్య హాట్ కామెంట్స్‌

May 28, 2020 at 5:09 pm

నేడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు‌ జయంతి సందర్భంగా ఆయన ఘాట్‌ను సంద‌ర్శించిన నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రభుత్వంతో సినీ పెద్దలు సంప్రదింపులు జరిపిన విషయం తనకు తెలీదని అన్నారు. పత్రికలు, మీడియా ద్వారా ఈ విషయాన్ని తాను తెలుసుకున్నానని చెప్పారు. ఎలాంటి చర్చలు జరుగుతున్నాయో కూడా తనకు తెలీదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ సమావేశానికి రావాలని తనను ఏ ఒక్కరూ పిలవలేదన్న బాలయ్య.. తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కూర్చుని హైదరాబాద్‌లో భూములు పంచుకుంటున్నారా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా కరోనా వలన దెబ్బ తిన్న సినీ పరిశ్రమ పుంజుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టనుందని తెలిపారు. అయితే ప్ర‌స్తుతం బాల‌య్య చేసిన వ్యాఖ్య‌లు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

కాగా, కరోనా వలన సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సినిమాల షూటింగ్‌ల విషయంలో పలువురు సినీ ప్రముఖులు సీఎం కేసీఆర్, మంత్రి తలసానిని కలిశారు. వారిలో చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, రాజమౌళి తదితరులు ఉన్నారు. ఈ క్రమంలో సినీ కార్మికులను ఆదుకుంటామని తెలిపిన కేసీఆర్, జూన్‌ నుంచి షూటింగ్‌లకు అనుమతిని ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

హైదరాబాద్‌లో కూర్చిని భూములు పంచుకుంటున్నారా..? బాల‌య్య హాట్ కామెంట్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts