బిగ్ బ్రేకింగ్: దేశంలో మరోసారి కరోనా ప్రతాపం…!టోటల్ నెంబర్ ఇదే…!

May 27, 2020 at 9:23 am

లాక్ డౌన్ ఉంది… కఠిన నిర్ణయాలు అమలులో ఉన్నాయి. అయినా సరే దేశంలో కరోనా మాత్రం ఆగడం లేదు. ప్రతీ రోజు ప్రతీ గంటా కూడా కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. వందల కేసుల నుంచి వేల కేసుల వరకు దేశం వెళ్ళింది. ప్రతీ రోజు కూడా ఆరు వేల కేసులకు పైగా దేశంలో కరోనా చుక్కలు చూపిస్తుంది. పాలకులు కరోనా కట్టడి లో ఉంది అని చెప్పినా సరే వాస్తవం మాత్రం మరోలా ఉంది.

 

గత 24 గంటల్లో కరోనా కేసులు ఆరు వేల మార్క్ ని దాటి వేగంగా దూసుకుపోతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కాసేపటి క్రితం హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. గత 24 గంటల్లో 6387 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి దేశ వ్యాప్తంగా 170 మరణాలు సంభవించాయని హెల్త్ బులిటెన్ లో ప్రకటించారు. మొత్తం కేసుల సంఖ్య 1,51,767 గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

 

83004 క్రియాశీల కేసులు ఉన్నాయి దేశంలో. 64425 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా కారణంగా మొత్తం 4337 మంది మరణించారని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తన హెల్త్ బులిటెన్ లో వివరించింది. మహారాష్ట్ర గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. తమిళనాడు లో కూడా వందల కేసులు నమోదు అవునే ఉన్నాయి.

బిగ్ బ్రేకింగ్: దేశంలో మరోసారి కరోనా ప్రతాపం…!టోటల్ నెంబర్ ఇదే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts